Youth | సంగారెడ్డి జిల్లా పరిధిలో ఓ యువకుడి అనుమాస్పద మృతి ఉద్రిక్తలకు దారి తీసింది. యువకుడి మృతి కేసుకు సంబంధించి ఆగ్రహావేశాలకు లోనైన దరఖాస్తుపల్లి గ్రామస్తులు వట్పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప(22) వట్పల్లి పరిధిలోని దాబాలో పని చేస్తున్నాడు. అయితేఅతడు ఓ చెట్టుకు ఉరి వేసుకొని అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సమాచారమందుకున్న పోలీసులు బీరప్ప కుటుంబీకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అతడి మృతదేహాన్ని చెట్టుపై నుంచి కిందికి దించారు.
తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని చెట్టుపై నుంచి ఎలా కిందికి దించారని పోలీసులపై, దాబా ఓనర్లపై దరఖాస్తుపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగిన గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పీఎస్‌లోని ఫర్నిచర్, అద్దాలు, కుర్చీలు ధ్వంసమయ్యాయి. గ్రామస్తుల ఆందోళనతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీరప్ప మృతికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంగారెడ్డి జిల్లాలో వట్పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన దరఖాస్తుపల్లి గ్రామస్తులు
వట్పల్లి పరిధిలోని దాబాలో పనిచేసే దరఖాస్తుపల్లి గ్రామానికి చెందిన బీరప్ప(22) చెట్టుకు ఉరి వేసుకొని అనుమానస్పద స్థితిలో మృతి
మృతుని కుటుంబీకులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని చెట్టుపై నుంచి… pic.twitter.com/Yi9Apdf2Uw
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2026