Ganesh Idol | మెదక్ రూరల్, ఆగస్టు 25 : హవెలీ ఘనపూర్ మండల కేంద్రంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి రాష్ట్రంలో ఎరువుల కొరత తీరాలని కోరుకుంటూ విఘ్నేశ్వరుడి ప్రతిమకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరత తీర్చడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలం అయ్యాయని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు, నాయకులకు బుద్ధి రావాలని విఘ్నేశ్వరుడికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రైతాంగం యూరియా కొరతతో కన్నీళ్లు పెడుతుందని అన్నారు. సొసైటీలు, ఆగ్రోస్ కేంద్రాల వద్ద లైన్లో నిలబడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ఎన్నడూ యూరియా కొరత రాలేదు. రైతులకు రైతుబంధు రైతు బీమా ఇచ్చి రైతులను ఆదుకొని పంట పండించిన తరువాత పంటను కొని రైతు ఖాతాల్లో డబ్బులు వేసిన ఘనత కేసీఆర్‌దని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రైతులు నాట్లు వేసిన నాటి నుండి ఇప్పటివరకు యూరియా కోసం రోడ్డెక్కిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో నెలకొందని పేర్కొన్నారు. లైన్లో చెప్పులు పెట్టుకుని భార్యాభర్తలు నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. కేసిఆర్ పాలనలో రైతులు ఎన్నడూ రోడ్డెక్కలేదు. కాంగ్రెస్ పాలనలో రైతులకు బోనస్ ఇస్తామని మోసం చేసి ఆరు గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చింది కానీ ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలకు బుద్ధి వచ్చే విధంగా రైతులకు యూరియా కొరత తీర్చాలని విఘ్నేశ్వరుడికి భక్తితో కోరి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్లు ఆరేళ్ల మల్లికార్జున్ గౌడ్, బట్టి జగపతి, నాయకులు అంజాగౌడ్, కిష్టయ్య, మేకల సాయిలు, రామచంద్రారెడ్డి, సతీష్ రావు, జీవన్ రావు, గంగ. నరేందర్, రంజా, శ్రీనివాస్,సత్యం గౌడ్, లక్ష్మీనారాయణ,లింగారెడ్డి, కిషోర్, మోహన్ నాయక్, హనుమంత్ రెడ్డి, స్వామి నాయక్, రంజిత్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
GST Rates | నవరాత్రులకు ముందే.. అమల్లోకి కొత్త జీఎస్టీ పన్ను శ్లాబులు..!
Supreme Court: దివ్యాంగులపై జోకులు.. క్షమాపణలు చెప్పాలని యూట్యూబర్ రైనాకు సుప్రీం ఆదేశాలు
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు