Collector Rahulraj | టేక్మాల్, నవంబర్ 17: నిరుపేదలకు కనీస నివాస గృహం ఉండాలన్న సంకల్పం తో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణలు జిల్లా లో వంద శాతం త్వరగా పూర్తి కావాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. టేక్మాల్ మండలంలో పర్యటించిన కలెక్టర్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అంశం మీద సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా అన్ని గ్రామాల వారీగా ఇంకా నిర్మాణాలు ప్రారంభించకుండా ఉన్న వాటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సుమారు 55 కోట్ల రూపాయల బిల్లుల చెల్లింపు పూర్తయిందన్నారు.
2,439 ఇందిరమ్మ ఇండ్ల బేస్మెంట్ పూర్తి చేశారని, 944 గోడలు పూర్తి చేశారని, 673 స్లాబుల స్థాయిలో ఉన్నాయన్నారు. ఇప్పటివరకు 24 ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని, ఇప్పటికీ 15 ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించడం జరిగిందన్నారు. నిరుపేదలకు పక్కా ఇల్లు ఉండాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకువచ్చిందని జిల్లాలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లు పురోగతి వేగం పెంచాలన్నారు.
మంజూరు అయిన ప్రతీ ఇళ్ల నిర్మాణం ప్రారంభం కావాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు. అసలు ఇంకా ఎందుకు నిర్మాణం చేపట్టలేదో అధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్య లు ఏమైనా ఉంటే తెలుసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఎవరైనా ఇంకా మొదలు పెట్టని వారి ఇండ్లు రద్దు చేసి ,అవసరం ఉన్న లబ్ధిదారులకు ఇవ్వాలని హౌసింగ్ అధికారులకు సూచించారు. మార్కింగ్ చేసినప్పటికీ ఇంకనూ బేస్మెంట్ నిర్మాణం చేయని లబ్ధిదారులతో మాట్లాడి.. వారి సమస్య లను తెలుసుకొని ఆ నిర్మాణాలు త్వరగా పూర్తి అయ్యేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Read Also :
Sarangapur | పంటల అవశేషాలను కాల్చడంతో సేంద్రీయ పోషకాలు నశిస్తాయి.. సారంగాపూర్ ఏవో ప్రదీప్ రెడ్డి
Farmers Protest | పత్తిని కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
NBK 111 | బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో రిపీట్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!