Sand Mafia | నర్సాపూర్, అక్టోబర్ 13 : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు టీజీఎండీసీ ఆధ్వర్యంలో నర్సాపూర్ మండలం మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ఇసుక బజార్ ను సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు కేవలం నల్గొండ నుంచి వస్తున్న ఇసుకకు ఒక్క మెట్రిక్ టన్నుకు రవాణా చార్జి కింద రూ.1200 చెల్లించి గ్రామ కార్యదర్శి ద్వారా టోకెన్ తీసుకొని వస్తే ఇసుకను ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇసుక మాఫియాను తొలగించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు.
మెదక్ జిల్లాకు 9వేల పైచిలుకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని.. ప్రస్తుతం వివిధ దశలలో ఇండ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీవో మహిపాల్ రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాస్, టి ఎస్ ఎం డి సి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Bihar Election | అభ్యర్థులను ఖరారు చేసిన జేడీయూ.. నాలుగు స్థానాలలో సిట్టింగ్లకు ఉద్వాసన..!
Explosives In Bag | వదిలేసిన బ్యాగులో పేలుడు పదార్థాలు.. బాంబ్బ్లాస్ట్కు కుట్రగా అనుమానం
Narnoor | మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు : ఎస్ఐ అఖిల్