Cyber Criminals | నిజాంపేట, జులై 2 : నిజాంపేట మండలంలోని నస్కల్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైబర్ నేరాలపై నిజాంపేట ఎస్సై రాజేశ్ బుధవారం అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎస్సై రాజేశ్ మాట్లాడుతూ.. ఫోన్కు వచ్చే ఓటీపీని ఎవ్వరికీ చెప్పకూడదన్నారు.
ప్రభుత్వ అధికారులమంటూ, బ్యాంక్ వాళ్లం అంటూ సైబర్ నేరగాళ్లు చేసే ఫోన్లకు స్పందించకూడదని సూచించారు. ముఖ్యంగా ఫోన్కు వచ్చే APK ఫైల్స్ ఓపెన్ చేయవద్దని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సత్యం రెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
SIGACHI | మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం.. సిగాచీ పరిశ్రమ ప్రకటన
Phoenix Movie | ఈ సినిమాకు ముందు 120 కిలోలున్నా : విజయ్ సేతుపతి కుమారుడు సూర్య