Medak Church | మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 16 : భక్తులతో మెదక్ చర్చి (Medak Church) కిటకిటలాడింది. ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు రావడంతో చర్చి లోపలి ప్రాంగణం కిటకిటలాడింది. ఈ సందర్భంగా యేసయ్య నామస్మరణలతో హోరెత్తింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రార్థనల్లో భక్తులు పాల్గొని యేసయ్యకు మొక్కులు తీర్చుకున్నారు.
ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులనుద్దేశించి చర్చి ప్రేసిబేటరీ ఇంచార్జి శాంతయ్య దైవ సందేశం చేశారు. శిలువ ప్రతి రూపమే యేసు ప్రభువు ప్రతిరూపమని, శిలువ దేవుని ప్రేమను చూపుతుందని, త్యాగపూరితమైన ప్రేమను యేసయ్య మనకు అందిస్తున్నాడన్నారు. ఆయనలో క్షమాపణ, ప్రేమ దయగుణాలు ఉన్నాయని, పోగొట్టుకున్న దానిని రక్షించే మార్గాన్ని చూపుతారన్నారు.
నమ్ముకున్న వారిని రక్షిస్తాడు, ప్రేమించిన వారిని ప్రేమిస్తాడన్నారు. యేసుక్రిస్తు సేవకునిగా తన జీవిత విధానాన్ని కొనసాగించానని, సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రభువు చూపిన మార్గంలో నడుచుకోవాలని సూచించారు. ప్రార్థనల అనంతరం ఫాస్టర్లు భక్తులను ఆశీర్వదించారు. ప్రార్థనల్లో చర్చి కమిటీ సభ్యులు గంట సంపత్, సువణ్ డగ్లస్, సంశాన్ సందీప్, జాన్సన్, నోబుల్సన్ తదితరులు పాల్గోన్నారు.
Kishan Reddy | బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా : కిషన్ రెడ్డి
MLA Vivekanand | ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తాం : ఎమ్మెల్యే వివేకానంద్
KCR | కేసీఆర్ జోలికొస్తే నాలుక చీరేస్తాం రేవంత్ రెడ్డి : బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్