KCR | ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన వ్యక్తి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మెచ్చే విధంగా మాట్లాడాలి కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ (KCR) పైన అనుచిత వాక్యాలు చేయడం చాలా బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను, వారి సమస్యలను గాలికి వదిలేసి ఈ రోజు రేవంత్ రెడ్డి ఒక మహా నాయకుడు తెలంగాణ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ సాధించిన వ్యక్తిని ఈ రోజు ఇలా దూషించడం చాలా సిగ్గుచేటని మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పేగులు తీస్తాం … కనుగుడ్లతో ఆడుకుంటాం… చెట్టుకు కట్టేస్తాం… పండబెట్టి తొక్కుతాం అని పిచ్చిగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టే రోజు వస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి భాష మార్చుకో.. వ్యవహారాన్ని మార్చుకో అని హెచ్చరించారు.
గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలను కూడా నువ్వు అవమానించి మాట్లాడిన చరిత్ర నీకు ఉంది అప్పుడు ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తే క్షమాపణ చెప్పిన చరిత్ర నీది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నీ భాషను మార్చుకోలేని పక్షంలో తెలంగాణ పల్లెలు, ప్రజలు ఎక్కడికక్కడే నిన్ను నిలదీస్తారు..
కడిగేస్తారు.. కనీసం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వ్యక్తులను, వ్యవస్థను గౌరవించడం నేర్చుకో. అంతేకానీ చిల్లర మల్లర మాటలు మాట్లాడకు . యాదవులను అవమానిస్తే మీకు పెండతో, దున్నపోతులతో బుద్ధి చెప్పారు. మళ్లీ అదే పరిస్థితి తీసుకురావద్దని నీకు గుర్తు చేస్తున్నామన్నారు గోసుల శ్రీనివాస్ యాదవ్.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు