నర్సింహులపేట, ఫిబ్రవరి 15: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లా నర్సింహులపేట మండలంలో గత కొన్నిరోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రైతు సేవా కేంద్రంలో మూడు రోజులు యూరియా లభించకపోవడంతో కార్యాలయం చుట్టూ తిరుగు తున్నారు.
శనివారం ఉదయం యూరియా లారీ రావడంతో గ్రామల నుంచి రైతులు ఎగబడ్డారు. గ్రామాల నుండి రైతులకు రావడంతో యూరియా కోసం లైన్లో నిలబడిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వంలో ఎరువుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుండి తిప్పలు తప్పడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.