కుత్బుల్లాపూర్, ఫిబ్రవరి 16 : ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా తగు చర్యలు తీసుకుంటున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకనంద్(MLA Vivekanand) అన్నారు. ఆదివారం 132- జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జయరామ్ నగర్లో రూ.90 లక్షల వ్యయంతో పూర్తిచేసిన సీసీ రోడ్లను ప్రారంభించారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమం కోసమే కృషి చేయాలన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి బలమైన రహదారులను నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించడమే లక్ష్యంగా నిరంతరం అభివృద్ధి పనులను చేపడుతామన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్రా రెడ్డి, సంక్షేమ సంఘం అధ్యక్షులు కుంటి మల్లేష్, ప్రధాన కార్యదర్శి మన్నే హరినాథ్, ఉపాధ్యక్షుడు లింగ భిక్షపతి, చైర్మన్ ఆర్ నరసింహ, కోశాధికారి ఎన్ చంద్రయ్య, సభ్యులు రాములు ఉపేందర్, నరేష్, అజయ్, కుమార్, యాది, రమేష్, ఈశ్వర్, సత్యనారాయణ, మల్లేష్, సత్తిబాబు, మహేష్, క్రాంతి, కుంట సిద్ధిరాములు, సంపత్ మాధవరెడ్డి, నరేందర్ రెడ్డి, సమ్మయ్య నేత, పోలే శ్రీకాంత్, విజయ హరీష్, రాములు యాదవ్, పాల్గొన్నారు.
కమనీయం.. కడురమణీయం
132 – జీడిమెట్ల డివిజన్ దండమూడి ఎంక్లేవ్లో వైభవోపేతంగా నిర్వహించిన వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వామి వారి కరుణా కటాక్షలతో ప్రజలంతా సుభిక్షంగా, సంతోషంగా ఉండాలన్నారు. ఆయన వెంట వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రాజశేఖర్ రెడ్డి, ఇంద్రారెడ్డి, కిరణ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, వేణు గోపాల్, వెంకట్, పుప్పాల భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.