వరంగల్: మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో నాసిరకం ఖనిజం లభిస్తుంది. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే నిధులు వృథా అవుతాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) అన్నారు. ఆదివారం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని బిజెపి చెప్పలేదని అన్నారు.
రాష్ట్రంలో చేసిన కులగణన ఏ ఒక్క బీసీ సంఘం కూడా అంగీకరించడం లేదన్నారు. రాష్ట్రంలో సర్వే పూర్తి అయి, బీసీ సంఘాలు సమర్ధిస్తే కేంద్రాన్ని ఒప్పించి ఆమోదం చేపిస్తామని హామీనిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలు, హామీలను అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ ఉందన్నారు.
ఇవి కూడా చదవండి..
GHMC | కుల గణనలో నమోదు కాని వారి కోసం.. జీహెచ్ఎంసీ ప్రత్యేక కాల్ సెంటర్
Marco OTT | మరో ఓటీటీలోకి మలయాళం బ్లాక్ బస్టర్ ‘మార్కో’
SKxARM | శివ కార్తికేయన్ – మురుగదాస్ ప్రాజెక్ట్ నుంచి క్రేజీ అప్డేట్