GHMC | మలక్ పేట, ఫిబ్రవరి 16 : కుల గణనలో నమోదు కానీ వారి కోసం జీహెచ్ఎంసీ ప్రత్యేక కాల్ సెంటర్ (040-21111111) ను ఏర్పాటు చేసిందని సౌత్ జోన్ సర్కిల్-6 డిప్యూటీ కమిషనర్ జయంత్ ఒక ప్రకటనలో తెలిపారు. కుల గణనలో నమోదు కాని వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ నెంబర్‌కు కాల్ చేసి వారి కుటుంబ సభ్యుల వివరాలు, మొబైల్ నెంబర్, అడ్రస్, పిన్ కోడ్ తదితర వివరాలు తెలియజేయాలని ఆయన సూచించారు.
ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ కాల్ సెంటర్ పని చేయనున్నదని, ఈ కాల్ సెంటర్ కు జీహెచ్ఎంసి పరిధిలోని ప్రజలతోపాటు వివిధ జిల్లాల నుంచి వచ్చే కాల్స్‌ను కూడా స్వీకరించి.. వారి వివరాలు ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపించబడతాయన్నారు. కాల్ చేసే వ్యక్తి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంటుందని, కుల గణనలో నమోదు కానీ వారి కోసం ఈనెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే నిర్వహించనున్నారని తెలిపారు.
గ్రామాల్లో అయితే గ్రామం, వీధి నెంబరు, పిన్ కోడ్, అడ్రస్ తదితర వివరాలు వెల్లడించాల్సి ఉంటుందని, పట్టణాల్లో అయితే సర్కిల్, వార్డు నెంబర్ తెలియజేస్తే ఎన్యూమరేటర్లు వారి ఇంటికి వచ్చి సర్వే నిర్వహించి వివరాలు సేకరిస్తారని తెలిపారు. మొబైల్ నెంబర్ ద్వారా సంబంధిత వ్యక్తి పాత డేటా బేస్‌లో నమోదు అయ్యారా లేదా అని పరిశీలించి, నమోదు కాకుంటే వారి వివరాలు సేకరించి నమోదు చేసుకుంటారని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగ పరుచుకోవాలని డీసీ జయంత్ కోరారు.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు