Unni Mukundan | మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మార్కో (Marco). హనీఫ్ అదేని (Haneef Adeni) ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. యాక్షన్ జానర్లో ఈ సినిమా వచ్చింది. డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా.. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది. అయితే ఇదే సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా.. మంచి వసుళ్లను రాబట్టింది.
ఇదిలావుంటే ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ ఓటీటీ వేదిక ‘సోనీలివ్’ ఈ చిత్రం ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మార్కో అందుబాటులో ఉంది. అయితే ఈ సినిమా మరో ఓటీటీలో కూడా రాబోతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా(Marco On AHA)లో ఈ సినిమా ఈ నెల 21 నుంచి మార్కో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది.