AR Murugadoss | తమిళ దిగ్గజ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన కెరియర్లో ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గజిని, తుపాకీ, కత్తి లాంటి సినిమాలు అయితే కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఇక తెలుగులో చిరంజీవితో స్టాలిన్.. మహేష్ బాబుతో స్పైడర్ మూవీని తెరకెక్కించారు. హిందీలో కూడా మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో గజిన్ రీమేక్ చేశారు. ఇక చాలా రోజులుగా డైరెక్షన్‌కు దూరంగా ఉంటున్న మురుగదాస్ తాజాగా ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
నటుడు శివకార్తికేయన్ – మురుగదాస్ కాంబోలో ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ఎస్కే23 అంటూ ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సప్త సాగర దాచే ఎల్లో(సప్త సాగరాలు దాటి) ఫేమ్ రుక్మిణి వసంత్ కథనాయికగా నటిస్తుండగా. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా టైటిల్‌తో పాటు గ్లింప్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్‌ను ఫిబ్రవరి 17న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
His arrival will mean one thing…CARNAGE 💥
The most awaited #SKxARM TITLE GLIMPSE out on February 17th at 11 AM. pic.twitter.com/mhE4ALHZFM
— A.R.Murugadoss (@ARMurugadoss) February 16, 2025