Organic Farming | జహీరాబాద్, మార్చి 27 : ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంతోనే పంటల దిగుబడిని సాధించవచ్చని జిల్లా వ్యవసాయాధికారి శివ ప్రసాద్ అన్నారు. ఇవాళ జహీరాబాద్ మండలంలోని దిడ్గి గ్రామ శివారులో డీడీఎస్-కేవీకే కేంద్రంలో రైతులకు శిక్షణ, వ్యవసాయ సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివ ప్రసాద్ మాట్లాడుతూ.. అధిక దిగుబడులు, నాణ్యమైన విత్తనాల వినియోగం, శాస్త్రీయ వ్యవసాయ పద్దతులతో పంటల దిగుబడిని సాధించవచ్చన్నారు.
సేంద్రియ వ్యవసాయంలో భూమిని కాపాడుకోవడమే కాకుండా చీడపురుగుల నివారణతో ఆదాయాన్ని పెంచుకోవచ్చన్నారు. డీడీఎస్-కేవీకే కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎస్సీ కార్పోరేషన్ కార్యనిర్వహణ అధికారి రామచారి మాట్లాడుతూ.. రాజీవ్ యువ వికాస్ పథకం కింద వ్యవసాయ పరికరాలు, వ్యాపారం చేసేందుకు సబ్సిడీపై అందజేయడం జరుగుతుందన్నారు.
డీడీఎస్-కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డా.వరప్రసాద్ మాట్లాడుతూ.. రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులు, సేంద్రియ వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న రైతులకు వ్యవసాయ పనిముట్లు, పరికరాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీడీఎస్-కేవీకే శాస్త్రవేత్తలు శైలజా, రమేశ్, స్నేహలత, హేమలత, సాయి ప్రియాంక, కైలాశ్, ఏడీఏ భిక్షపతి, ఏవో లావణ్య తదితరులు పాల్గొన్నారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!