Padayatra | వెల్దుర్తి, మార్చ్ 25 : మండల కేంద్రమైన వెల్దుర్తి నుండి జిల్లా కేంద్రమైన మెదక్‌కు దుర్భరంగా ఉన్న రోడ్డును తొలగించి రెండు వరుసల రోడ్డు నిర్మించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఇవాళ వెల్దుర్తి నుండి మెదక్‌కు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి గౌరీ మాట్లాడుతూ.. పాఠశాలలు, కాలేజీలతో పాటు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ పనుల నిమిత్తం మెదక్ వెళ్లేందుకు వెల్దుర్తి మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
వెల్దుర్తి-మెదక్ రోడ్డు నిర్మాణం మండల ప్రజల ఎన్నో ఏండ్ల కల అని.. ఆ కల కలగానే గడిచిపోతుందన్నారు. కావున ప్రభుత్వం స్పందించి వెల్దుర్తి-మెదక్ రోడ్డును రెండు వరుసల రోడ్డుగా నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రలో జిల్లా కార్యదర్శి నర్సమ్మ, శివ్వంపేట, నర్సాపూర్ మండలాల కార్యదర్శులు మహేందర్‌రెడ్డి, నాగరాజులతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?