MLA Sunitha Lakshma Reddy | చిలిపిచెడ్, జూలై 31: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని విమర్శించే స్థాయి కాంగ్రెస్ మండల నాయకులకు లేదని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, మాజీ సర్పంచుల పోరం అధ్యక్షుడు బేస్త లక్ష్మణ్ అన్నారు. గురువారం మండలంలోని శీలం పల్లిలో బీఆర్ఎస్ మండల నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత మంగళవారం చిలిపి చెడ్ రైతు వేదికలో రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేయడం సరైన పద్ధతి కాదని.. చేస్తే కలెక్టర్, ఎమ్మెల్యే అందరం కలిసి చేద్దామని ఎమ్మెల్యే అనడంతో కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. జిల్లా కలెక్టర్ ప్రజల కోసం పనిచేసే మనిషి.. కానీ ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు సంక్షేమ పథకాలు, జిల్లా ప్రజలకు 100% అందాయని కలెక్టర్ అనడం సరైన పద్ధతి కాదన్నారు.
కలెక్టర్ మాట్లాడిన పథకాల గురించి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి జిల్లాలో 30 నుంచి 40 శాతం రుణమాఫీ కాలేదన్న మాట వాస్తవమే.. ఈ విషయంపైన మండల కాంగ్రెస్ నాయకులు స్థాయిని మించి ఎమ్మెల్యేను విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజల బుద్ధి చెప్తారన్నారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏది సక్రమంగా లేవన్నారు. ఎమ్మెల్యేపైన కాంగ్రెస్ నాయకులు ఇష్టంగా మాట్లాడితే మేము కూడా ఖబర్దార్… ప్రజలకు ప్రభుత్వ పథకాలపైన అవగాహన కల్పించాల్సిన అధికారి పార్టీ నాయకుల ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
50% రుణమాఫీ కాలేదు..
చిలిపిచెడ్ మండలంలో జరగాల్సిన అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన కాంగ్రెస్ నాయకులు… సమస్యల గురించి మాట్లాడిన ఎమ్మెల్యేను విమర్శించడం సరికాదన్నరు. చిలిపిచెడ్ మండలంలోని టీజీవీబీ ఖాతాదారులకు 50% రుణమాఫీ కాలేదన్నారు. అరులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా.. రుణమాఫీపై చర్చకు సిద్ధమా.. మీకు చేతనైతే మండలంలో రైతులకు ఎరువులు, డిఏపి, యూరియా రైతులకు అందడం లేదు, వాటిని రైతులకు అందించేలా చర్యలు తీసుకోండి.. చేతకాని మాటలు మాట్లాడి..ఎమ్మెల్యేలను విమర్శించే స్థాయి మీకు లేదన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల మాజీ అధ్యక్షుడు గడ్డం నరేందర్ రెడ్డి, మండల రైతు సమన్వయ మాజీ అధ్యక్షుడు రాజిరెడ్డి, బీఆర్ఎస్ మాజీ సర్పంచులు దుర్గారెడ్డి, గోపాల్ రెడ్డి, అంకం యాదగిరి, ఇస్తారి, శంకర్ నాయక్, భిక్షపతి నాయక్, నాయకులు నరసింహారెడ్డి, ముకుంద రెడ్డి, వెంకట్ రెడ్డి, సయ్యద్ హుస్సేన్, శ్రీకాంత్ రెడ్డి, షఫీ, తదితరులు పాల్గొన్నారు.
MEO Gajjela Kanakaraju | విద్యార్థులకు జీవ వైవిధ్యం పాఠ్యాంశాలు బోధించాలి : ఎంఈఓ గజ్జెల కనకరాజు
Child laborers | బాల కార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు : ఎస్ఐ మానస