ఖమ్మం రూరల్, జూలై 31 : పాలేరు జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీలో రెగ్యూలర్ ప్రొఫెసర్లను తక్షణం నియమించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం కాలేజీ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా నాయకులు స్టాలిన్, శ్రీను మాట్లాడుతూ.. ద్యార్థి ఉద్యమలు ద్యారా సాధించిన ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజికి మూడేళ్లవుతున్నా ఎలాంటి వసతులు, పక్కా భవనాలు నిర్మించలేదన్నారు. ఫ్యాకల్టీ సైతం తాత్కాలిక పద్ధతిలోనే విద్యాబోధన చేస్తున్నట్లు చెప్పారు. విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పించాలని, తాత్కా లిక ఇంజినీరింగ్ కాలేజీ భవనాన్ని పూరిస్థాయి వసతులున్న భవనంగా తీర్చిదిద్దాలన్నారు.
పాలేరు జేఎన్టీయూకు సరైన భవనాలు నిర్మాణం చేయకుండానే ఐటీడీఏకు చెందిన బిల్డింగ్ భవనంలోనే హాస్టల్, కాలేజీ తరగతుల నిర్వహిస్తున్నారని అధికారులపై మండిపడ్డారు. ముఖ్యంగా విద్యార్థినులకు హాస్టల్ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలేజీ ఒకచోట, హాస్టల్ మరోకచోట ఉండడంతో సరైన రక్షణ లేక భయం భయంగా కాలేజీకి వెళ్తున్న పరిస్థితి ఉందన్నారు. జేఎన్టీయూ పాలక మండలి నిర్లక్ష్యంతో ఇప్పటి వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదన్నారు. కావునా తక్షణమే ప్రభుత్వం, జిల్లా మంత్రులు స్పందించి కాలేజీ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. లేనిపక్షంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు అలేఖ్య, అఖిల, స్పందన, కావ్య, అలేఖ్య పాల్గొన్నారు.