రాయపోల్ 31 : పాఠశాలలో విద్యార్థులకు జివ వైవిధ్యం పాఠ్యాంశాలను కూడా బోధించాలని దౌల్తాబాద్ మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని హిందూ ప్రియాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాథమికోన్నత స్థాయి కాంప్లెక్స్ సమావేశం జీవశాస్త్రం సబ్జెక్టు పై నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్జల కనకరాజు మాట్లాడుతూ విద్యార్థి కేంద్రీకృతంగా విద్యా బోధన జరుగాలన్నారు. ప్రతి సబ్జెక్టులో విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు.
జీవవైవిద్యంలోని మార్పులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు నేర్పించాలని, విద్యార్థులకు సబ్జెక్టు భారంగా అనిపించకుండా వినూత్నమైన పద్ధతుల ద్వారా విద్యా బోధన అందించాలని పేర్కొన్నారు. కాంప్లెక్స్ సమావేశంలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని పాఠశాల స్థాయిలో అమలుపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అఫ్జల్ హుస్సేన్, జిల్లా రిసోర్స్ పర్సన్ రాంప్రసాద్, మండల రిసోర్స్ పర్సన్ స్వాతి, దివాకర్ సిఆర్పిలు నగేష్, కుమార్ పాల్గొన్నారు.