రాయపోల్ జులై 31 : బాల కార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోల్ ఎస్ఐ మానస హెచ్చరించారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా గురువారం రాయపోల్ మండల పరిధిలోని రాంసాగర్ గ్రామాములో గల ప్రీమియం చిక్ ఫీడ్ సంస్థ యందు తనిఖీ నిర్వహించగా అందులో పని చేస్తున్న ఐదుగురు బాలకార్మికులను విముక్తి కల్పించారు.
సదరు సంస్థ యజమానులు సత్యేంద్ర కుమార్, సమాధాన్ తాత్యాబులపై అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పాతూరి జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మానస పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరు కూడా బాల కార్మికులను పనిలో పెట్టుకోవద్దని ఎస్ఐ సూచించారు.