Collector Rahul Raj | నర్సాపూర్ : మద్యం దుకాణాల ముందు చెత్తను విచ్చలవిడిగా వేయడంతో ఆగ్రహించిన కలెక్టర్ మద్యం దుకాణదారులకు రూ.5000 చొప్పున జరిమానా విధించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శనివారం నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పారిశుధ్యం, ప్రజారోగ్యం, మున్సిపాలిటీ అభివృద్ధి ప్రధాన ఎజెండాగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందన్నారు.
శనివారం ఉదయం 6 గంటలకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ నర్సాపూర్ మున్సిపాలిటీలో వివిధ వార్డులలో సంబంధిత మున్సిపల్ సిబ్బందితో కలిసి విస్తృతంగా పర్యటించారు. వార్డులలో సమస్యలు, ప్రజారోగ్య పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ ఈ అంశాలను పరిగణలోకి తీసుకొని వార్డుల్లో పర్యటిస్తూ శానిటేషన్ సిబ్బందికి, మున్సిపల్ అధికారులకు, పట్టణ ప్రజలకు పలు సూచనలు, సలహాలు అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రతలో మున్సిపల్ సిబ్బందికి సహాయ సహకారాలు అందించాలని, ఎక్కడబడితే అక్కడ చెత్త వేయకుండా ఇంటింటికి చెత్త బండి వచ్చినప్పుడు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అందించాలని, వివిధ షాపుల యజమానులు, మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న స్థలాల్లో చెత్త వేయరాదని తప్పనిసరిగా మున్సిపల్ సిబ్బందికే అందించాలన్నారు.
ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా నర్సాపూర్ మున్సిపాలిటీ తీర్చిదిద్దే విధంగా ప్రజలు, అధికారులు భాగస్వాములై ప్లాస్టిక్ నిర్మూలించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీ అనేది వైన్ షాపులు నుండే ప్రారంభం కావాలన్నారు వార్డులలో ఉన్న సమస్యలను చేపట్టవలసిన కార్యచరణ పై ప్రతిపాదన సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తద్వారా నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా ముందుకు పోతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Harish Rao | తెలంగాణ వాది స్వేచ్ఛ అకాల మరణం ఎంతో బాధాకరం : హరీశ్‌రావు
Operation Sindhu | ఆపరేషన్ సింధు ద్వారా 4,415 మంది భారతీయుల్ని తరలించాం : కేంద్రం