Sunitha lakshma reddy | సీఎం రేవంత్‌రెడ్డి అన్ని రంగాల్లో విఫలం.. త్వరలోనే ‘హల్దీ బచావో’ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Sunitha lakshma reddy | రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూస్తూ మరమ్మతులు చేపట్టకుండా కాలయాపన చేస్తోందని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు.
Sunitha lakshma reddy | నర్సాపూర్ / శివంపేట : జూలై 13: తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులకు సాగునీరు ఇవ్వాలని ప్రతిపక్షం కోరితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు.
సోమవారం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ కోణంలో చూస్తూ మరమ్మతులు చేపట్టకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కన్నెపల్లి పంప్‌హౌస్‌ను వెంటనే పూర్తి స్థాయిలో నడపాలని, సాగునీటిని అందించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ఆనవాళ్లను చెరిపివేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
త్వరలోనే ‘హల్దీ బచావో’..
రైతుల పంట పొలాల్లో నీరు పారించండి అని ప్రతిపక్ష నాయకులుగా కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరితే వారి రక్తాన్ని పారిస్తా అని సీఎం రేవంత్ రెడ్డి దుర్భాషలాడడంపై మండిపడ్డారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే “హల్దీ బచావో” కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఇటీవల పోక్సో కేసు నిందితుడు బెయిల్‌పై వచ్చి ఆరుగురు వ్యక్తులను హత్య చేసిన ఘటన రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
నిందితుడిని సకాలంలో పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని, బాధిత కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ పోలీసింగ్‌కు దేశవ్యాప్తంగా ఉత్తమ గుర్తింపు లభించిందని, ప్రస్తుతం మాత్రం శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి బీఆర్ఎస్ నాయకులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు నమోదు చేయడంపైనే దృష్టి సారించిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, సర్ మెంబర్ షిప్ నియోజకవర్గ ఇంచార్జ్ నరహరి రెడ్డి, ఎంపీపీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు కల్లూరి హరికృష్ణ, జడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యులు మన్సూర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.
Read Also :
Bloody Romeo | నాని అభిమానులకు నిరాశ: ‘ఓజీ 2’ పూర్తయ్యే వరకు నిలిచిపోనున్న ‘బ్లడీ రోమియో’!
Sandeep Reddy Vanga | ప్రభాస్ ‘స్పిరిట్’ క్రేజీ అప్డేట్.. త్వరలోనే భారీ క్లైమాక్స్ షూటింగ్!
S.Janaki | ప్రేమించి పెళ్లి చేసుకున్న జానకమ్మ.. భర్తతో అనుబంధం, కుటుంబ జీవితం వెనుక తెలియని కథ
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power cuts | మెదక్ జిల్లాలో కనీసం ఆరు గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదు : పద్మాదేవేందర్ రెడ్డ
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

