OG 2 | పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన భారీ విజయం తర్వాత, దర్శకుడు సుజీత్ తన తదుపరి చిత్రంగా నాని కథానాయకుడిగా ‘బ్లడీ రోమియో’ను ప్రకటించి, టీజర్‌తో అభిమానులను ఖుషీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఊహించని షెడ్యూల్ మార్పుల వల్ల ఈ ప్లాన్స్ అన్నీ మారిపోయాయి. ‘ది ప్యారడైజ్’ చిత్రం అకస్మాత్తుగా ఆలస్యం కావడంతో హీరో నాని, దర్శకుడు సుజీత్ ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే సుజీత్ తన దృష్టిని ‘ఓజీ 2’ స్క్రిప్ట్పైకి మళ్లించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ సీక్వెల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటనలు, కథా చర్చలు, స్క్రిప్ట్ వర్క్ అన్నీ శరవేగంగా జరిగిపోయాయి.
అయితే ఈ వేగం కారణంగా ‘బ్లడీ రోమియో’ ప్రాజెక్ట్ తాత్కాలికంగా పక్కన పడిపోయింది. తాజా సమాచారం ప్రకారం నాని అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమే అయినప్పటికీ, ‘ఓజీ 2’ పూర్తిగా పూర్తయ్యే వరకు ‘బ్లడీ రోమియో’ పట్టాలెక్కే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాపైనే పూర్తిగా దృష్టి పెట్టాలని, ఒకేసారి రెండు సినిమాలను హ్యాండిల్ చేయకూడదని సుజీత్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఈ సీక్వెల్ షూటింగ్ పూర్తి కావడానికి మరికొన్ని నెలల సమయం పడుతుండటంతో, ఇప్పుడు నాని తన తదుపరి ప్రాజెక్ట్‌గా ఏ సినిమాను ఎంచుకుంటారో చూడాలని పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.