Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’. పవర్ఫుల్ కాప్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే చిత్రం తదుపరి షెడ్యూల్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. సాధారణంగా సినిమా చివర్లో తీసే హై-వోల్టేజ్ క్లైమాక్స్ ఎపిసోడ్‌ను, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రాబోయే షెడ్యూల్లోనే చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ కీలక షెడ్యూల్లో హీరో ప్రభాస్‌తో పాటు ప్రధాన నటీనటులందరూ పాల్గొనబోతున్నట్లు సమాచారం.
ఈ మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ సరసన త్రుప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో ప్రభాస్ మునుపెన్నడూ చూడని విధంగా పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న హర్షవర్ధన్ రామేశ్వర్‌తో కలిసి డైరెక్టర్ మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశారు. టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా, సరికొత్త కథాంశంతో భారతీయ చిత్ర పరిశ్రమలోనే సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.