Voter list | పాపన్నపేట, జూలై 8 : ఓటర్ జాబితా తయారీలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని మెదక్ ఆర్డీఓ రమాదేవి అన్నారు. మంగళవారం రోజు ఆమె మండల కేంద్రమైన పాపన్నపేటలోని ఉన్నత పాఠశాలలో బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాపన్నపేట తహసిల్దార్ సతీష్‌తో కలిసి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటరు జాబితా తయారీలో బూత్ లెవెల్ అధికారుల పాత్ర కీలకం అని అన్నారు. కేటాయించిన పోలింగ్ స్టేషన్ పరిధిలోని అన్ని ఇళ్లను సర్వే చేసి ,కొత్త ఓటరులను నమోదు చేయాలని , ఓటరు జాబితాలో ఏమైనా తప్పులు ఉంటే సరి చేయాలని అన్నారు. అన్ని రకాల విషయాలను యాప్‌లో నమోదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్ సతీష్ కుమార్ ,డిప్యూటీ తహశీల్దార్ చరణ్, ఆర్ఐ నాగరాజు , మాస్టర్ ట్రైనర్స్ సత్యనారాయణ రెడ్డి , వర ప్రసాద్ , అంజాగౌడ్ , నర్సింహులు , దేవి సింగ్ , పంచాయతీ ఈవో నయీమ్, సూపర్ వైజర్లు, కరణం కవిత, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
Voter List 2
Mahankali Brahmotsavalu | ఈనెల18 నుంచి మహంకాళి అమ్మవారి బ్రహ్మోత్సవాలు
లేబర్‌కార్డు దారులకు రక్త నమూనాలు.. 20 వరకు సీహెచ్‌సీలో పరీక్షలు
Indiramma Indlu | ఇందిరమ్మ ఇండ్లపై తీవ్ర జాప్యం.. పునాదులకే పరిమితమైన నమూనా ఇళ్లు