Illegal Collections | మెదక్ మున్సిపాలిటీ, జూన్ 22 : మెదక్ జిల్లాలో అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సతీష్ పటేల్ ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పాఠశాలలను వ్యాపార కేంద్రాలుగా చేసుకుంటూ యూనిఫాం, బ్యాగులు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ తదితర పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అంతేగాకుండా ఫీజులు పెంచుతూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు.
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాజకీయ నాయకులు, విద్యాశాఖాధికారుల అండదండలతోనే విద్యార్థులను పీడిస్తున్నారన్నారు. అసలు జిల్లాలో ప్రభుత్వాధికారులున్నారా..? మొద్దు నిద్రపోతున్నారా..? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రలో నుంచి మేల్కొని అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సతీష్ డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా విద్యాధికారి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Peddagattu | జీఓ ఇచ్చారు.. నిధులు మరిచారు.. కాంగ్రెస్ హయాంలో లింగమంతుల స్వామికి శఠగోపమేనా?
Bigg Boss 9 | బిగ్ బాస్ సందడికి టైం ఫిక్స్ అయినట్టేనా.. కంటెస్టెంట్స్ ఎవరెవరంటే..!
Road Accident | వేగంగా వెళ్లి చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి..