Cyber Crime | నిజాంపేట, మార్చి 25 : మండలంలోని నగరంలో వీడ్స్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం హవేళి ఘన్పూర్ అధ్వర్యంలో ఇవాళ సైబర్ క్రైం, డిజిటల్ బ్యాంకింగ్‌పై ఉపాధి కూలీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ మోసాలు, ఫోన్‌కు వచ్చే ఓటీపీ ఎవ్వరికీ చెప్పకూడదని, లాటరీ పేరుతో సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మొద్దని ఉపాధి కూలీలకు ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు సూచించారు.
డిజిటల్ బ్యాంకింగ్‌తో లావాదేవీలు సులువుగా, సురక్షితంగా చేసుకోవచ్చన్నారు. వీటితోపాటు పలు ఇతర అంశాలపై సూచనలు చేశారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు నరేశ్‌కుమార్, నరేశ్, వంశీ ఉపాధి కూలీలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆరిఫ్ హూస్సేన్,ఉపాధి హామీ కూలీలు ఉన్నారు.
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?