Anti Ageing | వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మంపై కనిపించే ముడతలను ఇలా తగ్గించుకోండి
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ముడతలు కనిపించడం సహజం. అయితే కేవలం వయసే కాదు, చర్మంలో తేమ తగ్గడం, స్థితిస్థాపకత (ఎలాస్టిసిటీ) కోల్పోవడం, అధిక సూర్యరశ్మి, కాలుష్యం, ధూమపానం, అలాగే పోషకాహార లోపాలు కూడా ముడతలు త్వరగా రావడానికి కారణమవుతాయి.
Anti Ageing | వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై ముడతలు కనిపించడం సహజం. అయితే కేవలం వయసే కాదు, చర్మంలో తేమ తగ్గడం, స్థితిస్థాపకత (ఎలాస్టిసిటీ) కోల్పోవడం, అధిక సూర్యరశ్మి, కాలుష్యం, ధూమపానం, అలాగే పోషకాహార లోపాలు కూడా ముడతలు త్వరగా రావడానికి కారణమవుతాయి. చాలా మంది వీటిని తగ్గించేందుకు ఖరీదైన యాంటీ ఏజింగ్ క్రీములను ఉపయోగిస్తుంటారు. అయితే ఇంట్లోనే లభించే కొన్ని సహజ పదార్థాలతో కూడా చర్మ సంరక్షణ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం కూడా ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. మొట్టమొదటగా గుడ్డు తెల్లసొనను ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో గుడ్డు తెల్లసొనను బాగా గిలక్కొట్టి నేరుగా ముఖంపై రాసి, మృదువుగా మసాజ్ చేయాలి. సుమారు 15 నిమిషాలు లేదా పూర్తిగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇందులో ఉండే ప్రోటీన్, విటమిన్ బి, విటమిన్ ఇ చర్మాన్ని పోషించి ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి.
ఆలివ్ ఆయిల్, నిమ్మరసం..
ఆలివ్ ఆయిల్ కూడా చర్మానికి మంచి సహజ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్‌ను ముఖంపై మృదువుగా మసాజ్ చేసి, అదనంగా ఉన్న నూనెను మృదువైన వస్త్రంతో తుడవాలి. ఇలా చేయడం వల్ల ఉదయానికి చర్మం మరింత మృదువుగా, తేమతో కనిపించే అవకాశం ఉంటుంది. నిమ్మరసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. కొద్దిగా నిమ్మరసాన్ని ముడతలు ఉన్న ప్రాంతాల్లో రాసి సున్నితంగా మసాజ్ చేయవచ్చు. ఇది చర్మాన్ని కాంతివంతంగా కనిపించేలా చేయడంలో తోడ్పడుతుంది. అయితే నిమ్మరసం ఆమ్ల గుణాలు కలిగి ఉండటంతో ఎక్కువగా లేదా తరచూ ఉపయోగించకుండా జాగ్రత్త వహించాలి. అలోవెరా జెల్లో ఉండే మాలిక్ యాసిడ్ చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తాజా అలోవెరా ఆకులోని జెల్‌ను తీసి ముఖంపై రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. లేదా విటమిన్ ఇ ఆయిల్‌తో కలిపి కూడా ఉపయోగించవచ్చు.
అరటి పండు, క్యారెట్లు..
అరటిపండులోని పోషకాలు కూడా చర్మానికి మేలు చేస్తాయి. రెండు అరటిపండ్లను మెత్తగా మెదిపి పేస్ట్‌లా చేసి ముఖంపై రాసి సుమారు అరగంట తర్వాత కడిగేయాలి. కావాలంటే తేనె, అవకాడోతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. క్యారెట్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడి చర్మాన్ని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉడికించిన క్యారెట్‌ను తేనెతో కలిపి పేస్ట్ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత కడిగేయాలి. అలాగే క్యారెట్‌ను నేరుగా ఆహారంగా తీసుకోవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అనాసపండులో ఉండే ఎంజైములు చర్మానికి తేమను అందించడంతో పాటు చనిపోయిన కణాలను తొలగించడంలో సహాయపడతాయి. అనాసపండు ముక్కను నేరుగా ముఖంపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. చర్మ ఆరోగ్యానికి అత్యంత సులభమైన మార్గం తగినంత నీరు తాగడం. రోజుకు కనీసం రెండు లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం, చర్మం తేమను నిల్వ చేసుకోవడానికి సహాయపడుతుంది. దీంతో చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపించే అవకాశాలు మెరుగుపడతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

