Agriculture Equipments | మెదక్ రూరల్, సెప్టెంబర్ 25 : మెదక్ మండలంలోని ఆయా కులాలకు చెందిన అర్హత కలిగిన రైతులు సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు పొందేందుకు ఏవో కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని ఏవో శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్యాటరీ స్ప్రేయర్స్, పవర్ ప్లేయర్స్, రోటవేటర్స్, సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్ వంటి వాటి కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.
అర్హత గల రైతులు ఈ నెల 29లోగా తమ ఆధార్ కార్డు, పట్టా పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, రెండు పాస్ పోర్ట్ ఫొటోలు జతచేసి మెదక్ మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Woman Molest | వివాహితపై పోలీసుల అఘాయిత్యం.. కేసు నమోదు
Mulugu | ములుగు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షం..
KCR | కొంపెల్లి వెంకట్ గౌడ్ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు : కేసీఆర్