Applications | మెదక్ రూరల్, నవంబర్ 15 : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో డిసెంబర్ 03న అందించే పురస్కారాల కోసం అర్హులైన వ్యక్తులు లేదా సంస్థల నిర్వాహకులు ఈ నెల 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ పురస్కారాలకు దరఖాస్తులు చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://wdsc.telangana.gov.in లో ఉన్న మార్గదర్శకాలను అనుసరించాలన్నారు. దరఖాస్తులు చేసుకున్న తర్వాత ఈ నెల 17న సాయంత్రం 4:00 గంటల వరకు ఒక కాపీ మెదక్ జిల్లాలోని మహిళా శిశు దివ్యాంగులు, వయోవృద్దుల ట్రాన్స్‌జెండర్ శాఖలో సమర్పించాలని అన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Metro Station | ఢిల్లీ పేలుడు.. నాలుగు రోజుల తర్వాత తెరుచుకున్న రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్
Suryapet : లబ్ధిదారులకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ