Govt Books | మెదక్ మున్సిపాలిటీ, మే 19 : ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను దుకాణాల ద్వారా విక్రయించడానికి జిల్లాలోని పట్టణ, మండల పరిధిలలోని విక్రయదారులు అవసరమైన ఇండెట్ల కోసం ఈనెల 25వ తేదీలోగా దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి రాధాకిషన్ ఒక ప్రకటనలో తెలిపారు.
గతంలో అనుమతి పొందిన విక్రయదారులు జిల్లా విద్యాశాఖాధికారి ఇచ్చిన ప్రొసీడింగ్తో పాటు రూ.వెయ్యి జిల్లా విద్యాశాఖాధికారి మెదక్ పేరిట డీడీని జత చేయాలని సూచించారు. గత సంవత్సరం ఇచ్చిన పాఠ్యపుస్తకాల్లో మిగిలిన వాటి జాబితాను తరగతుల వారీగా డీఈవో కార్యాలయంలో సమర్పించాలని విజ్ఞప్తి చేశారు.
అనుమతి పొందాలనుకునే వారు మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ కార్మికశాఖాధికారి ఆనుమతి పత్రాలతో గత సంవత్సరం అమ్మకాల టర్నోవర్ చెల్లించిన అమ్మకం పన్ను రసీదు సైతం జతపరచాలన్నారు. ఇట్టి పత్రాలన్ని 2025-26 సంవత్సరాలకు చెల్లింపు రసీదు కలిగి ఉండాలన్నారు.