Telangana Open School Society | చిలిపిచెడ్, సెప్టెంబర్ 12 : చిలిపిచెడ్ మండల పరిధిలోని శీలంపల్లి గ్రామంలో గ్రామ సమైక్య సంఘం ఏర్పాటు చేసినట్లు చిలిపిచెడ్ మండల ఏపీఎం గౌరీ శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా లీడర్లతో ఏపీఎం మాట్లాడుతూ.. ప్రతీ గ్రామంలో టాస్- తెలంగాణ ఓపెన్ స్కూల్ సిస్టం ద్వారా పదవ తరగతి పూర్తి చేయలేని వారు ఇంటర్మీడియట్ పూర్తి చేయలేని మహిళలు, పురుషులు అందరినీ ఈ పథకం ద్వారా 15వ తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించాలని సూచించడం జరిగింది.
అదేవిధంగా పూర్తిగా నిరక్షరాస్యులైన వారు ఉల్లాస్ పథకంలో వాలంటరీ టీచర్ ద్వారా ఉచిత శిక్షణ పొంది అక్షరాస్యులు కావాలని సూచించడం జరిగింది. గ్రామంలోని మహిళలు అందరూ పోషకాహారం పొందడంలో భాగంగా నాటు కోళ్ల పంపిణీ పథకం ద్వారా ప్రతీ సభ్యురాలు 20 కోడి పిల్లలు తీసుకొని పెంచి వాటి ద్వారా ప్రతిరోజు పోషకాహారం పొందాలని సూచించడం జరిగింది.
అంతేకాకుండా గ్రామంలోని సంఘాల్లోంచి తొలగించబడిన వృద్ధ మహిళలందరినీ వృద్ధ సంఘాలుగా చేస్తూ.. 15 నుండి 18 ఏళ్ల లోపు ఉన్న బాలికలతో కిషోర్ బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీఎం గౌరీ శంకర్తోపాటు సీసీ వెంకటలక్ష్మి, సీఏ మాధవి, వివో లీడర్లు అంగన్వా టీచర్, సభ్య సంఘాల లీడర్లు పాల్గొన్నారు.
Mata Vaishno Devi | ఈ నెల 14 నుంచి మాతా వైష్ణోదేవి యాత్ర పునఃప్రారంభం..!
Shah Rukh Khan | 1500 కుటుంబాలకు సాయం… మరోసారి గొప్ప మనసు చాటుకున్న షారుఖ్ ఖాన్