Animal Welfare | పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో జంతువుల పాత్ర కీలకం : పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య
Animal Welfare | సోమవారం చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో జంతు సంక్షేమ వార్షికోత్సవాలు జిల్లా పశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అలాగే జడ్పీ పాఠశాల విద్యార్థులకు జంతు సంక్షేమం, వాటి పట్ల మన బాధ్యత అనే అంశంపై విద్యార్థులు తెలియజేశారు.
Animal Welfare | చిలిపిచెడ్, ఫిబ్రవరి 2: జంతువులు ప్రకృతిలో మనుషులతో సమానమైన భాగస్వాములని.. మన పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో జంతువులు కీలక పాత్ర పోషిస్తున్నాయని మెదక్ జిల్లా పశువైద్యాధికారి డాక్టర్ వెంకటయ్య పేర్కొన్నారు. సోమవారం చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ గ్రామంలో జిల్లా పశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జంతు సంక్షేమ వార్షికోత్సవాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అలాగే జడ్పీ పాఠశాల విద్యార్థులకు జంతు సంక్షేమం, వాటి పట్ల మన బాధ్యత అనే అంశంపై అధికారులు కీలక అంశాలను తెలియజేశారు.
అనంతరం మెదక్ జిల్లా పశు వైద్యాధికారి మాట్లాడుతూ.. మన పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో జంతువులు కీలక పాత్ర పోషిస్తాయి. కుక్కలు మనకు నమ్మకమైన స్నేహితులుగా ఉంటే, ఆవులు, ఎద్దులు వ్యవసాయంలో మనకు ఎంతో సాయపడతాయి. అడవి జంతువులు పర్యావరణాన్ని కాపాడుతున్నాయని అన్నారు.
నోరు లేని జీవుల బాధ.. జంతువులకు భాష లేదు కానీ భావాలు ఉంటాయి. మనలాగే వాటికి కూడా ఆకలి, దాహం, నొప్పి మరియు భయం వేస్తాయి. దురదృష్టవశాత్తు, మనిషి తన స్వార్థం కోసం జంతువులను హింసించడం మనం చూస్తూనే ఉన్నాం. వీధి కుక్కలను కొట్టడం, పక్షులను పంజరాల్లో బంధించడం, అడవులను నరికివేసి వన్యప్రాణుల నివాసాలను నాశనం చేయడం వంటివి మనం చేస్తున్న తప్పులు అన్నారు.
జంతు సంక్షేమం అంటే ఏమిటి..?
జంతు సంక్షేమం అంటే వాటిని కేవలం బ్రతికించడం మాత్రమే కాదు.. వాటికి ఐదు రకాల స్వేచ్ఛలను కల్పించడం, ఆకలి, దాహం నుండి స్వేచ్ఛ సరైన ఆహారం, నీరు అందించడం, అసౌకర్యం నుండి స్వేచ్ఛ ఉండటానికి సరైన నీడను కల్పించడం, నొప్పి, అనారోగ్యం నుండి స్వేచ్ఛ గాయపడినప్పుడు వైద్యం అందించడం, భయం, వేదన నుండి స్వేచ్ఛ, వాటిని భయపెట్టకుండా ఉండటం, సహజ ప్రవర్తనను ప్రదర్శించే స్వేచ్ఛ: వాటిని బంధించకుండా ఉండటం.
మనమేం చేయవచ్చు..?
మనం జంతువుల కోసం పెద్ద పెద్ద పనులు చేయనక్కర్లేదు, చిన్న మార్పులు చాలు. వేసవి కాలంలో మన ఇంటి బయట చిన్న గిన్నెలో పక్షులు, జంతువుల కోసం నీరు ఉంచండి. జంతువులపై రాళ్లు వేయడం, వాటిని హింసించడం మానుకోవాలి. వీధి జంతువులకు వీలైతే కొంచెం ఆహారం పెట్టండి. ప్రజల్లో జంతువుల పట్ల జాలి, కరుణ పెరిగేలా అవగాహన కల్పించాలి. ముగింపు జీవకారుణ్యమే పరమ ధర్మం మహాత్మా గాంధీ అన్నట్లు, ఒక దేశం గొప్పతనం అక్కడి జంతువులను చూసే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే, నోరు లేని జీవుల పట్ల ప్రేమను చూపుదాం, వాటిని సంరక్షిద్దాం. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తుపాకి రాములు, మండల పశువైద్యాధికారి డాక్టర్ వినోద్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Read Also :
Chandrababu | తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షిస్తాం : చంద్రబాబు
Supreme Court | పాకిస్తాన్ నుంచి వచ్చిన దళితులకు ఇండ్లు ఇవ్వాల్సిందే.. సుప్రీం కోర్టు ఆదేశం
KTR | మీరు దర్యాప్తు బృందానికి చీఫ్ అనే సంగతి గుర్తుచేసుకోండి.. సిట్ చీఫ్ సజ్జనార్కు కేటీఆర్ హితవు
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

