Nizampeta Farmer | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తెలంగాణ వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా నిజాంపేటకు చెందిన యువ రైతు పంపరి రాజశేఖర్ 2 బోర్లు వేసిన బొట్టు నీళ్లు పల్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఈ విషయమై రాజశేఖర్ మాట్లాడుతూ.. నాకున్న వ్యవసాయ భూమిలో నాలుగు ఎకరాల మేర మొక్కజొన్న పంట ఏషిన. రోజురోజుకు బోరు నుంచి నీళ్లు రావడం తక్కువైంది. నీళ్లు లేక మొక్కజొన్న పంట ఎండిపోతదని భయం పట్టుకుంది. ఇదంతా కాదని ఒక్కొక్కకి 400 ఫీట్ల వరకు రెండు బోర్లను బోరుబండితో వేయించినా…రెండింట్లో బొట్టు నీళ్లు రాలే.400 ఫీట్ల వరకు ఫీటుకు రూ.110 చొప్పున రెండు బోర్లకు బోరుబండి ట్రాన్స్పోర్ట్తో కలిపి రూ.95 వేలు ఖర్చు అయింది.మొక్కజొన్న పంట అమ్మిన అంతగనం పైసలు వచ్చే పరిస్థితి లేదన్నాడు.
10 ఏండ్లపాటు కేసీఆర్ పాలనలో రైతులమంతా సంతోషంగా వ్యవసాయం చేసుకున్నాం. బోర్ల నుంచి పంటలకు సరిపడా నీళ్లు అంది మంచిగా పంటలు పండించుకున్నాం. రైతుల పొలాల్లో చూద్దామన్నా బోరుబండి జాడ అగుపించలేదు. కానీ ఇప్పుడు ఏ ఊర్లోకి వెళ్లినా పంటలను కాపాడుకుందామనే ఆశతో రైతులు బోరుబండ్ల వెంబడి తిరుగుతున్నారని చెప్పుకొచ్చాడు.
Jangaon | మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి.. సమానత్వం, సాధికారత సాధించేలా ముందుకు నడవాలి..
BRS leader matla madhu | మాట్ల మధు కమీషన్లు తీసుకుంటాడన్న ఆరోపణలపై జిల్లెల్ల గ్రామస్తుల ఫైర్