Alyssa Healy | చిరస్మరణీయ శతకంతో జట్టును గెలిపించి.. సగర్వంగా వీడ్కోలు..!
Alyssa Healy : ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలీసా హీలీ (Alyssa Healy) క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. మహిళా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన హీలీ చిరస్మరణీయ శతకంతో జట్టును గెలిపించి.. పదహారేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికింది.
Alyssa Healy : ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలీసా హీలీ (Alyssa Healy) క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. మహిళా క్రికెట్ దిగ్గజాల్లో ఒకరైన హీలీ చిరస్మరణీయ శతకంతో జట్టును గెలిపించి.. పదహారేళ్ల సుదీర్ఘ కెరీర్‌కు ముగింపు పలికింది. స్వదేశంలో భారత జట్టులో సిరీసే తనకు ఆఖరిదని ఇదివరకే ప్రకటించిన ఆమె.. వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి సగర్వంగా ఆట నుంచి వైదొలిగింది. కెరీర్ ఆఖరి మ్యాచ్‌లో జట్టున నడిపించడం.. ఏకంగా 158 రన్స్ చేయడం.. వన్డే ఛాంపియన్ భారత జట్టుపై 3-0తో సిరీస్ విజయం నిజంగా అద్భుతమే కదా.
ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ మేనకోడలైన అలీసా హీలీ 19 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. ఆసీస్ దిగ్గజ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ మేనకోడలైన అలీసా హీలీ 19 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. 2010లో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో తను తొలి మ్యాచ్ ఆడింది. వికెట్ కీపర్‌గా, విధ్వంసక ఓపెనర్‌గా జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న హీలీ మూడేళ్ల క్రితం కెప్టెన్సీ చేపట్టింది.
Healy finishes off in style! pic.twitter.com/lONW6Fhy0z
— ESPNcricinfo (@ESPNcricinfo) March 1, 2026
మేగ్ లానింగ్ వీడ్కోలు పలికిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తన.. యాషెస్ సిరీస్‌లో 16-0తో ఇంగ్లండ్‌పై అద్భుతమైన విజయాల రికార్డు నెలకొల్పింది. హీలీ సారథ్యంలో ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌లో, నిరుడు భారత్‌లో ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో సెమీస్ చేరింది. ఈ 16 ఏళ్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకూ ఈ వెటరన్ బ్యాటర్ 162 టీ20లు, 126 వన్డేలు, 11 టెస్టులు ఆడింది. వికెట్ల వెనకాల చురుకుగా కదులుతూ టీ20ల్లో 126 మందిని ఔట్ చేసింది.
మనసులో ఎన్నో భావోద్వేగాలు
‘భారత జట్టుతో ఆడబోయే సిరీసే నా కెరీర్లో చివరిది. సో.. మనసులో ఎన్నో భావోద్వేగాలు కలుగుతున్నాయి. నా దేశానికి ఆడడాన్ని ఇప్పటికీ ఇష్టపడుతున్నా. అయితే.. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నాలోని పోరాట స్ఫూర్తి ఇప్పుడు తగ్గిపోయింది. అందుకే.. వీడ్కోలుకు సమయం వచ్చేసిందని భావిస్తున్నా. ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌లో నేను ఆడడం లేదు. సన్నద్ధతకు సమయం తక్కువ ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నా. స్వదేశంలో భారత్‌తో వన్డే, ఏకైక టెస్టులో కెప్టెన్సీ వహించి నా కెరీర్‌ను ఘనంగా ముగించాలని అనుకుంటున్నా. నేను కచ్చితంగా నా సహచరులను మిస్ అవుతాను. వారితో కలిసి టీమ్ సాంగ్ పాడుతూ ఇన్నింగ్స్ ఆరంభించడం వంటివి మిస్ అవుతాను. ఆస్ట్రేలియా తరఫున ఆడడం నాకు జీవితంలో దక్కిన అత్యంత గొప్ప గౌరవం. బంగారం, ఆకుపచ్చ రంగు జెర్సీలో చివరి సిరీస్ ఆడబోతున్నందుకు గర్వంగా ఉంది’ అని హీలీ తన రిటైర్మెంట్ వార్తను వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది.
An Alyssa Healy century in her final ODI!
And no one is prouder than Mitch Starc in the commentary box 😊#AUSvIND pic.twitter.com/Ey27zCbPt2
— 7Cricket (@7Cricket) March 1, 2026
నిరుడు భారత గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రెండు శతకాలు బాదిన హీలీని మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో భారీ ధర పలుకుతుందని అందరూ ఊహించారు. కానీ, అనూహ్యంగా ఆసీస్ సారథిని ఏ ఫ్రాంచైజీ కొనలేదు. దాంతో.. ఒకింత బాధకు గురైన హీలీ ఇక వీడ్కోలుకు వేళైందని గ్రహించింది. మహిళా క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన హీలీని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ టాడ్ గ్రీన్‌బెర్గ్ ప్రశంసించాడు. మైదానం లోపలా, వెలుపలా యువతరాన్ని ప్రభావితం చేసేలా నడుచుకున్న ఆమెను ‘ఆల్‌టైమ్ గ్రేట్ క్రికెటర్లలో ఒకరి’గా అభివర్ణించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీ నేత అభిజీత్ దీప్కే నానమ్మ మృతి
Gajwel MRO | నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? రైతును ఎమ్మార్వో ఎలా అవహేళన చేశాడో చూడండి.. వీడియో
Supermarket: సూపర్మార్కెట్లో పైకప్పు కూలి 38 మందికి గాయాలు
AP Cabinet | ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు
Delhi Police | సీజేపీ నిరసన.. బాడీ కెమెరాలు, ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్స్, డ్రోన్స్.. ఢిల్లీ పోలీసులు ఎలా సిద్ధమయ్యారంటే
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

