e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home మంచిర్యాల ఇంటి వద్దకే సెలూన్‌..

ఇంటి వద్దకే సెలూన్‌..

ఇంటి వద్దకే సెలూన్‌..
  • కరోనా నేపథ్యంలో క్షౌరశాలలకు వెళ్లేందుకు భయం
  • పాక్షిక, పూర్తి లాక్‌డౌన్‌లతో దుకాణాల్లో తగ్గిన రద్దీ..
  • ప్రత్యేక చర్యలు తీసుకుంటున్ననిర్వాహకులు
  • అదనపు చార్జీల వసూలు
  • ట్రెండ్‌ మార్చిన నాయీ బ్రాహ్మణులు

దండేపల్లి, మే 10 : ఒకప్పుడు నాయీ బ్రాహ్మణులు ఇంటి వద్దకే వెళ్లి క్షౌరం చేసేవారు. ఇప్పటికీ మారుమూల గ్రామాల్లో కూడా ఈ విధానం కొనసాగుతున్నది. క్షౌరం చేయించుకునే వారు యేడాదికి ఇంత అని నాయీ బ్రా హ్మణులకు ధాన్యం, డబ్బులు ఇచ్చేవారు. కాలం మా రుతున్న కొద్దీ పల్లెలతోపాటు పట్టణాలు, నగరాల్లో కూ డా హెయిర్‌ సెలూన్‌ దుకాణాలు విపరీతంగా వెలిశాయి. ఎవరైనా దుకాణాల వద్దకే వెళ్లి కటింగ్‌, షేవింగ్‌, ఫేస్‌ వాష్‌, హెయిర్‌ డై చేయించుకుంటున్నారు. కరోనా నేప థ్యంలో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పాక్షిక, పూర్తిస్థాయి లాక్‌డౌన్‌లు విధించుకుంటున్నారు. ఈ క్రమంలో దుకాణాలు కూడా మధ్యాహ్నం వరకు తెరిచి ఉంచుతున్నారు.

జాగ్రత్తలు తీసుకుంటున్నా..
కొవిడ్‌ నేపథ్యంలో సెలూన్‌ దుకాణాల వద్దకు వచ్చే వినియోగదారుల సంఖ్య తగ్గుతున్నది. మామూలు సమయంలో రోజూ 10-20 మంది వరకు కటింగ్‌, షేవింగ్‌ కోసం వచ్చేవారు. వైరస్‌ భయంతో ఇప్పుడు కనీసం ఐదుగురు కూడా రావడం లేదని నిర్వాహకులు తెలుపు తున్నారు. మాస్కులు, శానిటైజేషన్‌ చేస్తున్నా కస్టమర్లు రావడం లేదు. ఈ క్రమంలో నాయీ బ్రాహ్మ ణులు ట్రెండ్‌ మార్చారు. రెగ్యులర్‌ కస్టమర్లకు ఫోన్‌ చేసి ఇంటి వద్దకే వెళ్లి సేవలు అందిస్తున్నారు. సేవలు అం దించేటప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఒం టిపై డిస్పోజబుల్‌ క్లాత్‌ వేసుకోవడం, హీటర్లపై కత్తెర, దువ్వెన్లను పెట్టి సూక్ష్మరహితంగా మారుస్తున్నారు. ఇందుకోసం అదనపు చార్జీలు తీసుకుంటున్నారు.

మధ్యాహ్నం వరకే తీస్తున్నాం..
దండేపల్లి మండల కేంద్రంలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో 24 రో జుల నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ విధించుకు న్నాం. దుకాణాలను మధ్యాహ్నం వరకే తీస్తు న్నాం. తరువాత బంద్‌ చేస్తున్నాం. అన్ని జా గ్రత్తలు తీసుకొని క్షౌరం చేస్తున్నాం. మాస్క్‌ పె ట్టుకొని, శానిటైజ్‌ చేసుకుంటూ పని చేస్తున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో పని చేయాల్సి వస్తుంది. ఎదుటివారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని క్షౌరం తీస్తున్నాం.

  • సత్యం, సాయిరాం, దండేపల్లి

దుకాణాలు పూర్తిగా బంద్‌ చేసినం..
మాది దండేపల్లి మండలం తాళ్లపేట. కరోనా కేసులు విపరీ తంగా పెరుగుతుండడంతో గ్రా మంలో 24 రోజుల నుంచి పాక్షి క స్వచ్ఛంద లాక్‌డౌన్‌లో పా ల్గొంటున్నాం. రెండు రోజుల ముందు గ్రామంలో ఇద్దరు చని పోవడం, పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరగడం తో దుకా ణాలు పూర్తిగా బంద్‌ చేసినం. వారం రోజుల పాటు కటింగ్‌ షాపులు పూర్తిగా తీయొద్దని తీర్మానం చేసుకున్నాం. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి దగ్గర తీస్తున్నాం. అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పని చేస్తున్నాం. మాస్క్‌, శానిటైజర్‌లు వాడుతున్నాం. పనికి ఉపయోగించే పని ముట్లను పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నాం. కటింగ్‌ తీసేటప్పుడు వాడే దుస్తులు ప్రతి రోజు వేడి నీటిలో శుభ్రపరుస్తున్నాం.
-కంది రవి, నాయీ బ్రాహ్మణుడు, తాళ్లపేట

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఇంటి వద్దకే సెలూన్‌..

ట్రెండింగ్‌

Advertisement