బుధవారం 27 జనవరి 2021
Mancherial - Jan 14, 2021 , 00:50:30

వైభవంగా గోదారంగనాథుల కల్యాణం

వైభవంగా గోదారంగనాథుల కల్యాణం

మంచిర్యాల ఏసీసీ, జనవరి 13 : జిల్లా కేంద్రంలో శ్రీ గోదారంగనాథుల స్వామి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవం గా నిర్వహించారు. విశ్వనాథ దేవాలయం, గోదావరి సమీపంలో ఉన్న గౌతమేశ్వర స్వామి, హైటెక్‌ సిటీలోని హరిహర క్షేత్ర ఆలయంలో బుధవారం అర్చకులు కల్యా ణం జరిపించారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివా కర్‌రావు దంపతులు, విజిత్‌రావు, కౌన్సిల ర్‌ చైతన్య సత్యపాల్‌రెడ్డి, తోట తిరుపతి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సం ఖ్యలో హాజరయ్యారు. విశ్వనాథ ఆలయ ఈవో ముక్త రవి, శ్రీదేవి గౌడ్‌, హన్మంత రావు, పురెల్ల పోచమల్లు, చంద్రమౌళి, తిరు పతిరెడ్డి, సురభి రవికుమార్‌, బొలిశెట్టి నా రాయణ, చేతి నర్సయ్య, శ్రీనివాస రా వు, బోడ రాజమౌళి, విశ్వనాథ్‌, నగేశ్‌, భూ మారావు, చెట్ల రామయ్య, ఇంపటి రాజేం దర్‌, అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.

చెన్నూర్‌ టౌన్‌, జనవరి 13 : పట్టణంలో ని జగన్నాథ ఆలయంలో బుధవారం గోదాదేవి రంగనాథుల కల్యాణం అంగరంగవైభవంగా నిర్వహించారు. భోగి పండుగ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నట్లు ఆలయ అర్చకులు దామెర మోహనాచార్యులు తెలిపారు. 

సీసీసీ నస్పూర్‌, జనవరి 13 : సీసీసీ నస్పూర్‌ గోదావరికాలనీ(షిర్కె)లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గోదారంగనాథుల కల్యాణం వైభవంగా జరిగింది. పూజారులు సముద్రాల లక్ష్మణాచార్యులు, రమణాచార్యులు, నరేశ్‌చార్యు లు కల్యాణం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అన్నదానం చేశా రు. ఆలయ కమిటీ చైర్మన్‌ మల్లికార్జున్‌రా వు, ప్రధాన కార్యదర్శి పేరం రమేశ్‌, కాల్వ శ్రీనివాస్‌, అశోక్‌రావు, సదరపు శ్రీనివాస్‌, కుమార్‌, విజయలక్ష్మి పాల్గొన్నారు. 

భీమారం, జనవరి 13: మండల కేంద్రంలోని కోదండరామాలయంలో గోదా రంగనాయకుల కల్యాణాన్ని నిర్వహించారు, ఆలయంలో గోదారంగనాథులను అలంకరించారు. భక్తులు తరలివచ్చారు.

హాజీపూర్‌, జనవరి 13 : గుడిపేటలోని 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్‌ బెటాలియన్‌ ఎదురుగా ఉన్న గోవింద క్షేత్రంలో బుధవారం గోదా రంగనాథుల కల్యాణాన్ని ఆలయ అర్చకుడు నరసింహాచార్యుల ఆధ్వర్వంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కల్యాణాన్ని తిలకించారు. 

జన్నారం, జనవరి 13 : పొనకల్‌ గ్రామం లో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆల య కమిటీ ఆధ్వర్యంలో గోదాదేవి కల్యాణాన్ని జక్కు సత్తయ్య దంపతుల చేతుల మీదుగా వేదపండితులు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


logo