మంగళవారం 11 ఆగస్టు 2020
Mancherial - Jul 02, 2020 , 03:41:27

ఆలన ప్రారంభం

ఆలన ప్రారంభం

మంచిర్యాల అగ్రికల్చర్: మంచిర్యాల జిల్లాలో ఎన్‌సీడీ (నాన్ కమ్యూనికేషన్ డిసీజెస్) రోగులకు వైద్య సేవలంధించేందుకు ఆలన వాహనాన్ని జిల్లా ఏరియా దవాఖాన ఆవరణలో డీఎంహెచ్‌వో నీరజ బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. అ నంతరం ఆమె మాట్లాడుతూ ఎన్‌సీడీ (పెరాలసిస్, బీపీ, షుగ ర్, తదితర) రోగులకు వైద్య సేవలందించేందుకు ఈ వాహనంలో ఒక మెడికల్ ఆఫీసర్, ఒక ఏఎన్‌ఎం ఉంటారన్నారు. వీరు రోగి ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వడం, ఫిజియోథెరపీ చేయించడం, డ్రెస్సింగ్, మందులివ్వడం చేస్తుంటారన్నారు. రోగి పరిస్థితి క్లిష్టంగా ఉంటే జిల్లా దవాఖానకు తరలిస్తారని పేర్కొన్నారు. రోగుల కోసం దవాఖానలో ప్రత్యేకంగా ఐదు బెడ్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ వాహన సేవలు అర్బ న్ ఏరియాల్లో అందిస్తున్నట్లు చెప్పారు. దవాఖాన సూపరింటెండెంట్ అరవింద్, డిప్యూటీ డీఎంహెచ్‌వో  ఫయాజ్ ఖాన్, సీహెచ్‌వో జ్ఞానసుందరి, వైద్యురాలు స్పందన, హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్ పాల్గొన్నారు. 


logo