జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటీఆర్ శంకుస్థాపన
జర్నలిస్టుల డబుల్ బెడ్రూం ఇండ్ల | దేశాయిపేటలో రూ. 10.60 కోట్లతో జర్నలిస్టుల కోసం కడుతున్న 200 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు

వరంగల్ : వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దూపకుంటలో రూ. 31.80 కోట్లతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్రూం ఇండ్లు, దేశాయిపేటలో రూ. 10.60 కోట్లతో జర్నలిస్టుల కోసం కడుతున్న 200 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో పాటు జర్నలిస్టులు పాల్గొన్నారు.
ఇవాళ ఉదయం రాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను కేటీఆర్ ప్రారంభం చేశారు. ఈ ట్యాంక్ సామర్థ్యం 8 లక్షల లీటర్లు. వాటర్ ట్యాంకు అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంకు ప్రారంభం కంటే ముందు అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మంత్రి కేటీఆర్ వీక్షించారు. వరంగల్ పర్యటనలో భాగంగా మొత్తం రూ.1,700 కోట్లతో చేపట్టిన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. కేటీఆర్ వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, చల్లా ధర్మారెడ్డి, టీ రాజయ్య ఉన్నారు.
వరంగల్ నగరంలోని దూపకుంటలో రూ. 31.80 కోట్లతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్రూం ఇండ్లు మరియు దేశాయిపేటలో రూ. 10.60 కోట్లతో జర్నలిస్టుల కోసం కడుతున్న 200 డబుల్ బెడ్రూం ఇండ్ల పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీ @KTRTRS. pic.twitter.com/UYfsJkn4mc
— KTR, Former Minister (@MinisterKTR) April 12, 2021
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

