e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News వింత ఆచారం: దున్న‌పోతుతో తొక్కించుకుంటే మంచి జ‌రుగుతుంద‌ట..!

వింత ఆచారం: దున్న‌పోతుతో తొక్కించుకుంటే మంచి జ‌రుగుతుంద‌ట..!

వింత ఆచారం: దున్న‌పోతుతో తొక్కించుకుంటే మంచి జ‌రుగుతుంద‌ట..!

తూర్పుగోదావ‌రి: ‌దున్నపోతుతో తొక్కించుకుంటే త‌మ‌ గ్రామానికి అరిష్టం తొల‌గిపోతుంద‌ని, తమ కష్టాలు తీరిపోతాయ‌ని గ్రామ ప్ర‌జలంతా బోర్లాప‌డుకుని దున్న‌పోతుతో తొక్కించుకున్నారు. తూర్పుగోదావ‌రి జిల్లా యు.కొత్త‌ప‌ల్లి మండ‌లం అమీనాబాద్ గ్రామంలో ఆదివారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. గ్రామంలో ప్ర‌తి ఏడాది జ‌రిగే పోలేర‌మ్మ జాత‌ర సంద‌ర్భంగా గ్రామ‌స్తులు దున్న‌పోతుతో తొక్కించుకునే ఈ ఆచారం అనాదిగా వ‌స్తున్న‌ద‌ని వారు చెబుతున్నారు.

ఈ ఆదివారం జరిగిన పోలేర‌మ్మ జాత‌ర‌లో ఉదయం నుంచి ఉపవాసం ఉన్న భక్తులు, గ్రామస్తులు సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దున్నపోతుకు పూజలు చేసి, గరగ నృత్యాల మధ్య గ్రామంలో ఊరేగించి, ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఉపవాసం ఉన్న భక్తులందరూ పసుపు నీళ్లతో స్నానం చేసి, అమ్మవారి ఆలయం ఎదురుగా బారులు తీరి పడుకున్నారు. ఆ త‌ర్వాత ఓ భ‌క్తురాలు వారిని తొక్కుతూ వెళ్తుండ‌గా ఆమె వెనుక‌నే దున్న‌పోతు కూడా తొక్కుతూ వెళ్లింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

జ‌ర్న‌లిస్టుల డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌కు కేటీఆర్ శంకుస్థాప‌న

నాకు పాజిటివ్ వ‌చ్చిందా.. ప‌కోడీలు వేశాక‌ వ‌స్తాలే..!

నూకాల‌మ్మ జాత‌ర‌లో గిరినాగు ప్ర‌త్య‌క్షం.. భ‌యంతో ప‌రుగులు తీసిన జ‌నం..!

టీకాలే లేకుండా టీకా ఉత్స‌వ్ ఎలా.. ‌ప్ర‌ధానికి ముఖ్య‌మంత్రుల లేఖ‌లు..!

దారిత‌ప్పి బావిలోప‌డ్డ ఏనుగుపిల్ల‌.. ర‌క్షించిన అధికారులు.. వీడియో

ఇరాన్ అణు కేంద్రంపై సైబ‌ర్ దాడి !

కాబోయే భ‌ర్త ర‌మ్మ‌న్నాడు.. ఆ త‌ర్వాత హ‌త్య

ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఖిలాడి టీజ‌ర్

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వింత ఆచారం: దున్న‌పోతుతో తొక్కించుకుంటే మంచి జ‌రుగుతుంద‌ట..!

ట్రెండింగ్‌

Advertisement