DGCA New Rule | విమానంలో పిల్లలకు తల్లిదండ్రుల పక్కనే సీటు కేటాయించాలి.. ఎయిర్‌లైన్స్‌కు డీజీసీఏ ఆదేశం..!
DGCA New Rule | విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 సంవత్సరాల్లోపు పిల్లలకు తప్పనిసరిగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి పక్కనే సీటును కేటాయించాలని ఎయిర్‌లైన్స్ కంపెనీలను కోరింది.
DGCA New Rule | విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 సంవత్సరాల్లోపు పిల్లలకు తప్పనిసరిగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి పక్కనే సీటును కేటాయించాలని ఎయిర్‌లైన్స్ కంపెనీలను కోరింది. పిల్లలు తల్లిదండ్రులు, సంరక్షకులతో ప్రయాణించిన సందర్భాల్లో చాలాసార్లు దూరంగా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తోందంటూ డీజీసీఏకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న డీజీసీఏ.. తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఎవరో ఒకరి వద్ద కూర్చునే అవకాశం ఉంటే ప్రయాణం సజావుగా సాగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నది.
అలాగే, పిల్లలకు తల్లిదండ్రుల్లో ఎవరి పక్కన సీటును కేటాయిస్తే.. ఆ విషయాన్ని రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించింది. దాంతో పాటు మరికొన్ని రూల్స్‌ను సైతం డీజీసీఏ మార్చింది. ప్రిఫరెన్షియల్ సీటింగ్ గురించి ప్రస్తావించింది. విమానం బయలుదేరే సమయం వరకు చెకిన్ కోసం ఏ సీటునూ ఎంచుకోని ప్రయాణికులకు ఆటోమెటిక్‌గా సీటును కేటాయించే నిబంధనను సవరించింది. జీరో బ్యాగేజీ ఛార్జీలు, భోజనం, స్నాక్, డ్రింక్ ఛార్జీలు, సంగీత వాయిద్యాల క్యారేజ్ కోసం ఛార్జీలను పెంచుకునేందుకు షెడ్యూల్ చేసిన విమానయాన సంస్థలకు అనుమతి ఇచ్చింది. ట్రాన్స్పోర్ట్ సర్క్యులర్‌లో డీజీసీఏ పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

