Srinivas Goud | మహబూబ్ నగర్ : హన్వాడ మండల పరిధిలోని నాయినోనిపల్లి గ్రామంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న పంటలను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల పొలాల్లోకి వెళ్లి పంటలను చూశారు. కొంతమంది రైతులు జరిగిన నష్టాన్ని వివరించారు. దీంతో శ్రీనివాస్ గౌడ్ చలించి పోయారు. రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు. రైతులకు ఇస్తామని చెప్పిన రైతు బంధు ఇవ్వండి.. రుణమాఫీ చేయాలని.. వడగండ్ల వానతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.. వాటికి నష్ట పరిహారం ఇవ్వండనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు నష్టపోకుండా మొలకెత్తినా వడ్లను కూడా కొనుగోలు చేశామని గుర్తు చేశారు. వానకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40 వేల సహాయం అందించాలని డిమాండ్ చేశారు.
రైతు రుణమాఫీ అయిందని అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రులు క్షేత్ర స్థాయిలోకి వస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు. ప్రభుత్వం రైతుల పాలిట నిర్లక్ష్యం వహిస్తే రైతులు మరో పోరాటానికి సిద్ధం అవుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తుందనీ, అసమర్ధ పాలన వల్ల నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ఆరోపించారు.
వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలనీ డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, పంట నష్టపోయిన రైతుల వివరాలని ప్రభుత్వానికి పంపించాలన్నారు. మహబూబ్ నగర్ మండల పరిధిలోని చాలా గ్రామాల్లో పంట దెబ్బతిందన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంట మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ గౌడ్, రైతు కమిటీ అధ్యక్షులు కొండయ్య, సీనియర్ నాయకులు నెత్తికొప్పుల శ్రీను, చెన్నయ్య, జంబులయ్య, పెద్ద చెన్నయ్య, రాజుయాదవ్, అనంత రెడ్డి , బాలకిష్టయ్య, హరీష్ చందర్, వెంకన్న, మాధవులు, శ్రీనివాసులు, వెంకటయ్య, తిరుపతయ్య, బలవర్దన్ , రామకృష్ణ పాల్గొన్నారు.
Eknath Shinde | కమ్రా సుపారి తీసుకున్నట్లుంది.. కమెడియన్ వ్యాఖ్యలపై స్పందించిన ఏక్నాథ్ షిండే
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి ఎన్కౌంటర్.. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
Bangladesh | మహమ్మద్ యూనస్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు..? త్వరలో బంగ్లాలో సైనిక పాలన..?