land grabbing | ప్రభుత్వ స్కూల్ సమీపంలో 12 ఎకరాల భూమి కబ్జా.. అధికార పార్టీ నాయకుల హస్తం..!
land grabbing | గత కొంతకాలం క్రితం దాదాపు 33 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొనుగోలు చేశారు. ఆ భూమిలో గోదాములు ఏర్పాటు చేసుకొని మిగతా భూమిని వారు చదును చేసుకుంటూ పాఠశాల సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూడా కూల్చి వేశారు.
land grabbing | ఖిల్లా ఘనపూర్ మండలంలోని కొత్తపల్లి తాండలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్‌ను కొంతమంది అధిక పార్టీకి చెందిన నాయకులు. కూల్చివేశారు. గత కొంతకాలం క్రితం దాదాపు 33 ఎకరాల భూమిని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కొనుగోలు చేశారు. ఆ భూమిలో గోదాములు ఏర్పాటు చేసుకొని మిగతా భూమిని వారు చదును చేసుకుంటూ పాఠశాల సమీపంలో ఉన్న వాటర్ ట్యాంక్ కూడా కూల్చి వేశారు.
పాఠశాల పరిసర భూమిని కబ్జాకు గురి చేసుకోవాలని చూస్తున్నారని.. తండావాసులు వారిని ప్రశ్నించగా తాము ఈ భూమిని కొనుగోలు చేశామని ఇట్టి భూమిలో మా అవసరాల నిమిత్తం కాంపౌండ్ ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. కానీ మీరు కొనుగోలు చేసిన భూమి చుట్టూ 12 ఎకరాల గ్రామకంఠ భూమి ఉందని అందులో భాగంగానే ఈ పాఠశాల వాటర్ ట్యాంకులు నిర్మించడం జరిగిందని అయినప్పటికీ మీరు వాటర్ ట్యాంక్ ను కూల్చడం ఎవరికి చెప్పకుండా వాటర్ ట్యాంక్ ను కూల్చడం ఎంతవరకు సమంజసమని వారిని ప్రశ్నించారు. ఆదివారం తండావాసులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తండాకు చెందిన 12 ఎకరాల గ్రామకంఠం భూమిని చూపించి వారి భూములను కాంపౌండ్ ఏర్పాటు చేసుకోవాలని తండావాసులు కోరుతున్నారు.
ఇదే పాఠశాలలో గత ఎన్నికల్లో పోలింగ్ కేంద్రం-47 ఉందని.. ఇక్కడే తండాకు చెందిన వాసులు ఎమ్మెల్యే, ఎంపీ, సర్పంచ్ వార్డు సభ్యుల పోలింగ్ కేంద్రం ఉండేదని.. మేము అంతా అక్కడే ఓటు హక్కు వినియోగించుకున్నామని.. వారు స్వలాభాల కోసం పాఠశాలను కూడా కూల్చివేసి కబ్జాకు గురి చేసే అవకాశం ఉందని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ గ్రామకంఠ భూమిని రక్షించాలని కోరుతున్నారు.. దీనిపై ఏంఈవో జయశంకర్ వివరణ కోరగా…తాండలో ప్రభుత్వ పాఠశాల ఉంది కానీ అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ లేరని గత కొంతకాలంగానే ఈ పాఠశాలను మూసి వేయడం జరిగిందని తెలిపారు. దీనిపై ఎస్సై వెంకటేశ్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందింది వాస్తవమేనని కానీ అది నా పరిధిలో లేదు కాబట్టి తహసిల్దార్ కార్యాలయానికి సమాచారం ఇచ్చి పూర్తి వివరాలు సేకరించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Land Grabbing1

Read Also :
Pahalgam attack | పహల్గాం దాడికి ఏడాది.. పాక్ తీవ్రవాదంపై అమెరికాలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన భారత్
Bike Rally | హిందూ సమ్మేళనం సందర్భంగా తాండూర్‌లో బైక్ ర్యాలీ
Watch: కలెక్టర్‌తో రైతుల సమావేశంలో కోతి.. తర్వాత ఏం జరిగిందంటే..?
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

