Sand Mining | మాగనూరు, అక్టోబర్ 21 : ఇసుక తరలించడానికి అవకాశం ఇవ్వడం లేదని జీపీఓపై ట్రాక్టర్ యజమాని రాయితో దాడికి ప్రయత్నించిన సంఘటన మాగనూరు మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు మాగనూరు మండల కేంద్రంలోని పెద్దవాగు బ్రిడ్జి సమీపంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో పర్మిషన్ పేరిట ఇసుక ట్రాక్టర్లు తరలిస్తున్నారు. అయితే వాగులో ఎస్ఆర్ఏలను పెట్టి డాక్టర్ల లెక్కలు చూస్తూ ఉండేవారు.
అయితే కొంతమంది ఎస్ఆర్ఏలు డబ్బులకు కక్కుర్తి పడి ఒక్కొక్క ట్రాక్టర్ చొప్పున 300 నుండి 400 రూపాయలు అక్రమంగా వసూలు చేసి అక్రమ ఇసుక తరలింపులకు సహకరించేవారు. ఈ విషయంపై కొంతమంది తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లడంతో ఇసుక తరలించే దగ్గర ఎస్ఆర్ఏతోపాటు జీపీఓ కూడా ఉండి అక్రమ ఇసుక తరలింపునకు పాల్పడకుండా చర్యలు చేపట్టాలని తహసీల్దార్ ఆదేశాలు జారీ చేయడంతో గురురావు నింగంపల్లి గ్రామ జీపీఓ నాగేష్ ఇసుక తరలించే దగ్గరకు వెళ్లి తగిన చర్యలు చేపడుతున్నారు.
ట్రాక్టర్ యజమానులకు, జీపీఓలకు మధ్య ఘర్షణ..
అయితే మాగనూరు మండల కేంద్రం నుండి రెండు రోజులుగా అక్రమ ఇసుక తరలింపునకు తావివ్వకుండా ఎస్ఆర్ఎ తాయప్ప జీపీఓ నాగేష్ అడ్డుపడుతున్నాడనే దురుద్దేశంతో ఎస్ఆర్ఏ, జీపీఓపై రాయితో దాడికి యత్నించారు. ఈ సంఘటనలో ట్రాక్టర్ యజమానులకు జీపీఓలకు మధ్యలో కొద్దిపాటి తోపులాట ఘర్షణ చోటుచేసుకోవడంతో మధ్యాహ్నం ఇసుక తరలింపు నిలిపివేసి తాసిల్దార్ కార్యాలయానికి రావాలని తహసీల్దార్ చెప్పడంతో జీపీఓ, ఎస్ఆర్ఏ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇసుక ట్రాక్టర్ యజమానులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఎవరో ఒకరు గొడవకు దిగితే మాకు ఎందుకు ఇసుక అనుమతి నిలిపేస్తావని తహసిల్దార్ తో ఇసుక తరలించే ట్రాక్టర్ యజమానులు గొడవకు దిగారు. డ్యూటీలో ఉన్న జీపీఓపై ఎలా దాడికి యత్నించారు.. అని ట్రాక్టర్ యజమానులు, తహసిల్దార్ సురేష్ మధ్య కొద్దిపాటి మాటల యుద్ధం కొనసాగింది. ఇంకోసారి ఇలా దాడికి యత్నించారంటే ఇసుక పర్మిషన్ రాకుండా చేస్తానని ట్రాక్టర్లు యజమానులను తహసీల్దార్ హెచ్చరించారు.
ఈ సంఘటనపై తహసీల్దార్‌ను వివరణ కోరగా.. ట్రాక్టర్ యజమానుల, జీపీఓల మధ్య గొడవ జరిగిన విషయం వాస్తవమేనని మరోసారి ఈ సంఘటన జరిగితే గొడవలకు కారణమైన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ సురేష్ హెచ్చరించారు.
Read Also :
Narnoor | నార్నూర్ ఉప మార్కెట్ యార్డులో వెదజల్లుతున్న దుర్వాసన
Sukumar | శిష్యుల కోసం సుకుమార్ దుబాయ్ ట్రిప్.. లెక్కల మాస్టారు మంచితనానికి టాలీవుడ్ ఫిదా!