Urea | మాగనూరు జులై 20 : రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలకుండా చూసుకోవాలని నారాయణపేట్ జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్ అన్నారు. ఆదివారం మాగనూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం రైతు ఆగ్రో సేవ కేంద్రంలోని ఎరువుల దుకాణాలను తనిఖీలు చేశారు.
రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలుగ కుండా, ప్రస్తుత అవసరాలకు మేర రైతులు యూరియా కొనుగోళ్లు చేయాలన్నారు. చాలా మంది రైతులు ముందస్తుగానే రెండవ, మూడవ దఫా ఎరువులు కొని దాచుకుంటున్నారు. అలా కాకుండా ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడే కొనుగోలు చేయాలని కోరారు. మార్కెట్ నుండి ఎప్పటికప్పుడు యూరియా సరఫరా చేస్తాం అని తెలిపారు.
ప్రస్తుతం ప్రాథమిక వ్యవసాయ సహకారం కేంద్రంలో 1500 బస్తాలు, రైతు ఆగ్రో సేవా కేంద్రంలో 500 బస్తాల యూరియా అందుబాటులో ఉందని, ప్రతిరోజు కూడా వస్తూ ఉంటుందని, రైతులు అధైర్య పడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాగనూరు మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్. పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి రైతు అగ్రో సేవా కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Yellareddypet | పల్లెను మరిచిన ప్రభుత్వం.. గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం..
Siddaramaiah | డీకే శివకుమార్ పేరెత్తిన కార్యకర్త.. తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం సిద్ధరామయ్య
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి