Grama Swarajyam | మాగనూరు, ఆగస్టు 24 : నాడు మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం మంట గలిసింది.. పల్లెలు పట్టణాలకు పట్టుకొమ్మలు కాదు నిలువుటద్దాలుగా మిగిలిపోయినాయని మాగనూరు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి అన్నారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ… మాగనూరు మండలంలోని అన్ని గ్రామాల్లో పారిశుధ్యం మంటగలిసింది. దాదాపు 18 నెలలు కావస్తున్నా గ్రామపంచాయితీ ఎన్నికలు జరిపే దమ్ములేని దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజపాలనలో గ్రామపంచాయితీ కార్యదర్శులను అప్పుల పాలు చేసి రాక్షస ఆనందం పొందుతుందన్నారు.
ప్రత్యేక అధికారుల పాలనలో గ్రామ వ్యవస్థ కాస్త కుంటుపడింది. నేరడగం, ఒబ్లాపూర్, బైరంపల్లి, ఉజ్జలి, తాళంకేరి తదితర గ్రామాల్లో దాదాపు గత కొన్ని నెలల నుండి చెత్త ట్రాక్టర్ గ్రామ పంచాయితీ ముందు దిష్టి బొమ్మల్లా దర్శనమిస్తున్నాయి. కార్యదర్శులను అడుగగా ప్రతీ గ్రామ పంచాయతీలను పంచాయతీ కార్యదర్శి అప్పులు చేసి పనులు చేస్తున్నారని నేరడగం, మాగనూర్ రెండు పెద్ద గ్రామపంచాయితీలకు కార్యదర్శి తిమ్మప్ప ఇప్పటివరకు రూ. 7 నుండి 8 లక్షలు గ్రామాల అవసరాల నిమిత్తం అప్పులు చేసుకుని ఉన్నట్లు తెలిపారు.
కనీసం డీజిల్‌కు డబ్బులు లేవు అంటున్నాడు. గ్రామంలో చెత్త పేరుకుపోయింది అంటున్నా నేరడగం ప్రజలు చెత్తను గ్రామ పంచాయితీ దగ్గర తెచ్చి వేస్తాము అంటే వేయండి నేను ఏమీ చేయలేను ఇప్పటికే మోయలేని భారం మోస్తున్నాము. ఇంకా మా నుండి కావడం లేదని చేతులెత్తేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల రైతుల బాధ వర్ణణాతీతం. వ్యవసాయానికి ఎరువుల యూరియా కొరత పాతరోజులు గుర్తుకొస్తున్నాయి. పాస్‌బుక్కులు, చెప్పులు, మనుషులు లైన్లో నిల్చునే రోజులు వచ్చినందుకు ప్రజలకు బాగా బుద్ధి చెబుతున్నారని.. ఇప్పటికైనా ప్రజలను ఇబ్బంది గురి చేయకుండా చూడండి మహా ప్రభో అంటూ ఎల్లారెడ్డి మొరపెట్టుకున్నారు.
Read Also :
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
IADWS | ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
Finger Millet | రాగులను అసలు రోజుకు ఎంత మోతాదులో తినాలి..? వీటితో కలిగే లాభాలు ఏమిటి..?