MP DK Aruna | కొడంగల్ నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ చేస్తున్న దాడులపై బీజేపీ ఎంపీ డీకే అరుణ సీరియస్ అయ్యారు. అధికార పార్టీలో ఉన్నాం.. ఇళ్లపైకొచ్చి దాడులు చేస్తామంటే ఊరుకోం.. ఇది ఎవ్వరి జాగిరు కాదు.. ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి దాడులను సహించేది లేదన్నారు. మేము ప్రతి దాడులు చేస్తే తట్టుకోలేరని హెచ్చరిక జారీ చేశారు.
కోస్గి మండలం మీర్జాపూర్లో గత రాత్రి కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన తీరు అనైతికమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో ఎంపీ డీకే అరుణ సోమవారం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మీర్జాపూర్‌కు వెళ్లి బాధితుడు (బీజేపీ) కార్యకర్తను, వారి కుటుంబాన్ని పరామర్శించారు. బాధితుడు రమేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవ్వరు భయపడొద్దు మీకు నేను ఉన్నానని భరోసా ఇచ్చారు.
కావాలనే దాడి చేశారు..
ఎంపీ డీకే అరుణ ముందు బీజేపీ కార్యకర్త రమేష్ కుటుంబ సభ్యులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. తమ ఇంటి గేటుకు ముందు బీజేపీ గుర్తు పెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేకే తమపై భౌతిక దాడులు చేశారు. కింద పడేసి కొట్టి దౌర్జన్యం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్ముందు తమపి ఇలాంటి దాడులు జరగకుండా చూడాలని విన్నవించుకున్నారు.
ఎవ్వరినీ వదలొద్దు..
మీర్జాపూర్లో మ పార్టీ కార్యకర్తపై జరిగిన ఈ దాడిపై సీరియస్ యాక్షన్ తీసుకోండి. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారంలో ఉన్నామని ప్రభావితం చేస్తారు. అలాంటివేవి పట్టించుకోవద్దు. దాడి చేసిన ప్రతి వ్యక్తికి శిక్ష పడేలా చూడాలని బాధితుల ముందే కోస్గి ఎస్ఐకి ఎంపీ డీకే అరుణ్ ఆదేశాలు జారీ చేశారు.


Rathotsavam | తిరుచానూరులో వైభవంగా రథోత్సవం..శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
Lakshmi Mittal | పన్నుల సెగ.. బ్రిటన్‌కు స్టీల్ టైకూన్ లక్ష్మీ మిట్టల్ గుడ్‌బై..?
BR Gavai: బెంజ్ కారును వదిలి వెళ్లిన మాజీ సీజేఐ గవాయ్..