హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నగారా మోగింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఏప్రిల్ నెలలో పదవీకాలం ముగియనున్న 37 రాజ్యసభ స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు సభ్యుల పదవీకాలం ముగియనుండటంతో ఇకడ ఎన్నికలు అనివార్యమయ్యాయి. తెలంగాణ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ, కేఆర్ సురేశ్‌రెడ్డి పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 9తో ముగియనున్నది. ఈ రెండు ఖాళీలతోపాటు 10 రాష్ర్టాల్లోని 37 స్థానాల భర్తీ కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ఖరారు చేసింది.
ఎన్నికలకు ప్రత్యేక నిబంధనలు
రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే సభ్యులకు ఎన్నికల సంఘం ప్రత్యేక నిబంధనలను విధించింది. ఓటర్లు ప్రాధాన్యతలను గుర్తించడానికి రిటర్నింగ్ అధికారి అందించే ఇంటిగ్రేటెడ్ వయలెట్ కలర్ సెచ్ పెన్నును మాత్రమే ఉపయోగించాలని సూచించింది. ఇతర పెన్నులు వాడితే ఆ ఓటు చెల్లబోదని స్పష్టంచేసింది. ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు అబ్జర్వర్లను నియమించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. తెలంగాణ (2), మహారాష్ట్ర (7), తమిళనాడు (6), పశ్చిమబెంగాల్ (5), బీహార్ (5), ఒడిశా (4), అస్సాం (3), ఛత్తీస్‌గఢ్ (2), హర్యానా (2), హిమాచల్‌ప్రదేశ్ (1) రాష్ట్రాల్లో ఖాళీ కానున్న స్థానాలకు ఎన్నికలు జరుపనున్నట్టు ఈసీ వివరించింది.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు షెడ్యూల్ తేదీలు