Lata Gupta : ఢిల్లీ మహిళా కమషన్ చైర్‌పర్సన్‌గా లతా గుప్తా నియామకమయ్యారు. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఇతర సభ్యులుగా శ్యామ్ బాలా, మల్టీ వర్మ, లతా సిద్ధి, సంరక్షిక శర్మ ఝా, రేణు భల్లాను సభ్యులుగా నియమించింది. ఢిల్లీలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి రెండేళ్లుగా ఖాళీ ఉంది.
2024 జనవరిలో స్వాతి మాలివాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజ్యసభకు ఎంపిక కావడంతో చైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు. మహిళల హక్కుల రక్షణ, భద్రత, గౌరవం, సాధికారతలో మహిళా కమిషన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. కొత్తగా ఏర్పాటైన కమిషన్ మహిళలకు న్యాయం, భద్రత, సహాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి కార్యాలయం అభిప్రాయపడింది. చైర్‌పర్సన్‌గా ఎంపికైన లతా గుప్త దీర్ఘకాలంగా బీజేపీలో పని చేస్తున్నారు.
ఆమె ఢిల్లీ బీజేపీకి ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. అలాగే, బీజేపీ జనరల్ సెక్రెటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె ఢిల్లీలోని లక్ష్మీ నగర్ నియోజకవర్గంలోని రెండు వార్డులకు మున్సిపల్ కౌన్సిలర్‌గా కూడా పని చేసినట్లు తెలుస్తోంది. గతంలో ఢిల్లీ స్టాండింగ్ కమిటీకి కూడా చైర్‌పర్సన్‌గా కూడా సేవలందించారు.