Telangana Congress | వరంగల్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు మళ్లీ అవమానమే ఎదురవుతున్నది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినట్టే రేవంత్ సర్కార్ వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఇక్కడి రేవంత్ క్యాబినెట్‌ను, ఆ పార్టీ నేతలను ఉన్నపళంగా రావాలని హుకుం జారీ చేసింది. ఈ పిలుపు రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంతో కాంగ్రెస్ పార్టీ చెలగాటం ఆడుతున్నదని మరోసారి తేలిపోయింది. రాష్ట్ర సాధన ఉద్యమ సమయం నుంచి మొదలుకొని నిన్నమొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సభల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ అనుమానాన్ని అయితే వ్యక్తం చేశారో అక్షరాలా అదే నిజమని జరుగుతున్న పరిణామాలు స్పష్టంచేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తాజా పరిణామాలు తెలంగాణ ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ గౌరవించకపోగా అవమానించేలా ఉన్నాయనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
గురువారం తెలంగాణ క్యాబినెట్‌ను ఢిల్లీకి పిలిపించుకుని కాంగ్రెస్ పెద్దలు చేసే సమీక్ష ఏమి ఉంటుందని? కాంగ్రెస్ చర్య ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టువంటిదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ స్వయంపాలన, స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ఆత్మాభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ భంగపరుస్తున్నది. పార్టీపరంగా తన అంతర్గత వ్యవహారాల కోసం ఎన్ని సమీక్షలైనా చేసుకోనివ్వండి. కానీ, మొత్తం మంత్రివర్గాన్ని ఢిల్లీ దర్బార్‌కు పిలిపించుకొని సమీక్ష చేసే అధికారం ఆ పార్టీకి ఎవరు ఇచ్చారు? తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నది ఇందుకోసమేనా? తెలంగాణ భూభాగాన్ని తన సామంత ప్రాంతంగా, తెలంగాణ ప్రజలను తన బానిసలుగా కాంగ్రెస్ పార్టీ చూస్తున్నదా? అని తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ, పాలన గాలికి వదిలేస్తూ ఢిల్లీకి చకర్లు కొట్టడం వల్ల తెలంగాణ బతుకు తెల్లారిపోతున్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఢిల్లీ అడుగులకు మడుగులొత్తుతూ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణపై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారనే ఆరోపణలకు బలం చేకూర్చేలా తాజా పరిణామాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రజాధనం జాతీయ కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాలకు ఎరువుగా మారుతున్నదని, అందుకోసం రేవంత్ సర్కార్ ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతున్నారని, అందులో భాగమే రాష్ట్రంలో ఇష్టారీతిగా పెరిగిపోతున్న అవినీతి అని, ఆ భారం మోయలేక తెలంగాణ నడుము విరిగిపోతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
‘మేం పాలకులం కాదు.. సేవకులమే’ అని సీఎం రేవంత్‌రెడ్డి దగ్గరి నుంచి ఉపముఖ్యమంత్రి, మంత్రులందరూ సందర్భం వచ్చిన ప్రతిసారీ వల్లెవేస్తున్నమాట. కానీ, ప్రస్తుతం జరిగిందేమిటి? మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మొదటి నుంచి చెప్పిందే నిజమని తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీ తన బాస్ ఢిల్లీలో ఉన్నదని, తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించి 12 ఏండ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ పార్టీ తెలంగాణ ప్రజలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నదనే ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డిని, ఆయన మంత్రిగణాన్ని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి పిలిచి రాష్ట్ర ప్రయోజనాలపై సమీక్ష నిర్వహించటం దారుణంగా ఉన్నదని, తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తన చెప్పుచేతల్లోకి తీసుకుని ఎలా కీలుబొమ్మను చేసి ఆడిస్తున్నదో అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముందే ఊహించి హెచ్చరించారని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ. మేము ఢిల్లీకి గులాములం కాదు. మాకు ఢిల్లీల ఎవడు బాస్ ఉండడు. తెలంగాణ ప్రజలే మా బాసులు. మమ్మల్ని నిర్దేశించేది.. ఆదేశించేది తెలంగాణ ప్రజలే. కాంగ్రెస్, బీజేపీలకు ఢిల్లీ సిట్ అంటే సిట్. స్టాండ్ అంటే స్టాండ్. ఆ పార్టీలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఎన్నటికీ కాపాడలేవు. బీఆర్ఎస్కు అధిష్ఠానం లేదు. బీఆర్ఎస్ను శాసించేవాళ్లు లేరు. బీఆర్ఎస్కు బాసులు ఎవలూ లేరు. బీఆర్ఎస్కు ఉన్న ఒకే ఒక బాస్ తెలంగాణ ప్రజలు. తెలంగాణకు ఉన్న అధిష్ఠానం రాష్ట్ర ప్రజలు. తెలంగాణను శాసించేది, బీఆర్ఎస్ను నడిపించేది తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్కు దిశానిర్దేశం చేసేది తెలంగాణ ప్రజలు. ప్రజలే కేంద్రబిందువుగా, ప్రజల అవసరాలే ఇతివృత్తంగా నడిచేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే’ అని కేసీఆర్ అనేక సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తుండటం గమనార్హం.
బీఆర్ఎస్ పార్టీ. మేము ఢిల్లీకి గులాములం కాదు. మాకు ఢిల్లీల ఎవడు బాస్ ఉండడు. తెలంగాణ ప్రజలే మా బాసులు. మమ్మల్ని నిర్దేశించేది.. ఆదేశించేది తెలంగాణ ప్రజలే. కాంగ్రెస్, బీజేపీలకు ఢిల్లీ సిట్ అంటే సిట్. స్టాండ్ అంటే స్టాండ్. ఆ పార్టీలు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను ఎన్నటికీ కాపాడలేవు. బీఆర్ఎస్కు అధిష్ఠానం లేదు. బీఆర్ఎస్ను శాసించేవాళ్లు లేరు. బీఆర్ఎస్కు బాసులు ఎవరూ లేరు. బీఆర్ఎస్కు ఉన్న ఒకే ఒక బాస్ తెలంగాణ ప్రజలు. తెలంగాణకు ఉన్న అధిష్ఠానం రాష్ట్ర ప్రజలు. తెలంగాణను శాసించేది తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ను నడిపించేది తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్కు దిశానిర్దేశం చేసేది తెలంగాణ ప్రజలు. ప్రజలే కేంద్రబిందువుగా, ప్రజల అవసరాలే ఇతివృత్తంగా నడిచేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. -బీఆర్ఎస్ అధినేత కేసీఆర్