Makthal Market | మక్తల్, జనవరి 20 : చెట్లే మానవాళికి జీవనాధారంగా భావించి రాబోయే తరాల భవిష్యత్తు కోసం ముందస్తు ఆలోచనతో చెట్లను పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో అవేవి పట్టనట్టుగా అడ్డగోలుగా చెట్లను నరికివేస్తున్నారు. అయినప్పటికీ చెట్లను నరికేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మక్తల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం చోద్యం చూస్తుందనడానికి నిదర్శనమే మక్తల్ వ్యవసాయ మార్కెట్లో చెట్లు నరికి వేసిన ఈ సంఘటన. మంగళవారం ఈ దృశ్యం కెమెరా కంటికి చిక్కింది.
మార్కెట్ స్థలాన్ని కబ్జా చేస్తూ..
వివరాలలోకి వెళ్తే.. మక్తల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతుల పండించిన ధాన్యాన్ని విక్రయించే ట్రేడర్స్ కు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ, అవేవీ పాటించకుండా ప్రైవేట్ వ్యక్తులు, అడ్డగోలుగా వ్యవసాయేతర కార్యకలాపాలు నిర్వహిస్తూ, మార్కెట్ యార్డ్ సముదాయంలోవ్యాపారాలను కొనసాగిస్తున్నారు. తాజాగా వ్యవసాయ మార్కెట్ యార్డులో, ప్రైవేట్ వ్యక్తులైనటువంటి కోకా కోలా డీలర్ మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా భవన నిర్మాణాన్ని నిర్మించడంతోపాటు, 10 ఫీట్లు ముందు భాగంలో, 15 ఫీట్లు వెనకాల భాగంలో మార్కెట్ స్థలాన్ని కబ్జా చేస్తూ, భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఈ భవన నిర్మాణం మార్కెట్ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్నప్పటికీ, మార్కెట్ కార్యాలయ సిబ్బంది వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.
సదరు భవన నిర్మాణానికి చెందిన యజమాని, మార్కెట్ యార్డులో మార్కెట్ స్థలాన్ని అబ్జర్వ్ చేస్తూ భవన నిర్మాణాన్ని చేపట్టడంతోపాటు, మార్కెట్లో ఉన్నటువంటి ఏపుగా పెరిగినటువంటి చెట్లను, ఎలాంటి అనుమతులు లేకుండా, అడ్డగోలుగా తమకు ఇష్టం వచ్చినట్లుగా చెట్లను నరికి వేస్తున్నప్పటికీ, మార్కెట్ కార్యాలయ సిబ్బంది వారిపై చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని సదరు ట్రేడర్స్ కార్యాలయ సిబ్బందిని విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా మక్తల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయ సిబ్బంది మామూళ్ల మత్తు నుండి నిద్ర మేల్కొని సదరు వ్యాపారిపై చర్యలు తీసుకొని , వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి సంబంధించిన స్థలాన్ని కబ్జా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ముందు కాంగ్రెస్ స్కాంలపై విచారణ జరిపించాలి.. బాలరాజు యాదవ్ డిమాండ్
Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదు: వద్దిరాజు రవిచంద్ర
కేసులకు భయపడితే బీఆర్ఎస్ పార్టీ ఉండేదే కాదు: టీజీపీఎస్సీ మాజీ మెంబర్ సుమిత్రానంద్